నిజమైన రామాయణం

ఇదే మన దౌర్భాగ్యం రామాయణం గురించి నిజా నిజాలు తెలియకుంటే ఇలాగే అనుకుంటాం:
రావణుడు తన చెల్లి సూర్పణక ను  అగౌర పరచినదుకు (ముక్కు చెవులు కోసినందుకు) సీతమ్మని అపహరించలేదు..

◆ సూర్పణక ముక్కు చెవులు కోయటనికో గల కారణం:

సీత రాములు,లక్ష్మణుడు అరణ్యం లో సంచరిస్తున్న సందర్భంలో లో సూర్పణక రాముణ్ణి చూసి మోహిస్తుంది. రాముని దగ్గరకు వెళ్ళి తనతో భోగించమని కోరుకుంటుంది ,దానికి రాముడు తిరస్కరించి నాకు సౌందర్య వతి అయిన భార్య ఉంది నేను నీతో భోగించను అని సమాధానం ఇస్తాడు .ఇంకొంచెం సరదా కోసం రాముడు ,సూర్పణకకు లక్షమునుణ్ణి చూపించి అతను ఒంటరిగా వున్నాడు ,అతని దగ్గరికి వేళ్ళు అని చెప్తాడు.
వెంటనే సూర్పణక లక్షణుని దగ్గరకు వెళ్లి తనతో భోగించమని అడుగుతుంది దానికి లక్షణుడు నేను మా అన్నయ్య వెంట వచ్చాను, అతనే నాకు గురువు,రాజు అని చెప్పి నువ్వు రాముని దగ్గరకే వేళ్ళు అని అంటాడు, మళ్ళీ సూర్పణక రాముని దగ్గరకి వెళ్ళి తనతో భోగించమని అడుగుతోంది. రాముడు తిరస్కరిస్తాడు..
దానితో కోపాన్ని పొందిన సూర్పణక సీతమ్మ ఉండటం వల్లనే తనతో రాముడు బోగిస్తాలేదు అని సీతమ్మ ని చంపడానికి ప్రయత్నిస్తుంది దానితో సీతమ్మ భయానికి లోనవుతుంది అప్పుడు రాముడు ,సూర్పణక ముక్కు చెవులు కోయమని లక్ష్మణుణ్ణి ఆదేశిస్తే ,లక్ష్మణుడు సూర్పణక ముక్కు చెవులు కోసి పంపిస్తాడు..

అప్పుడు సూర్పణక రావణుని దగ్గరకు వెళ్తుంది ..

◆సూర్పణక & రావణుని మధ్య సంభాషణ:

సూర్పణక రావణుని దగ్గరకు వెళ్లి ,"అన్నయ్య నేను సౌందర్య వతి అయిన ఆవిడను చూసాను ఆమె పేరు సీత,ఆమె భర్త రాముడు ఆమె చాలా సౌందర్యవతి  మరియు గునవతి ,ఆమె రాముని దగ్గర ఉండటం కంటే నీ దగ్గర ఉండటమే సరిఅయిన అంశ,అందుకు నేను ఆమెను నీ కోసం తీసుకు వద్దామని ప్రయత్నిస్తే నా ముక్కు చెవులు కోసారు"

ఈ విదంగా చెప్పగానే రావణుడు నిజా నిజాలు నిర్దారించుకోకుండా తన చెల్లి చెప్పిన అబద్ధపు మాటలను నమ్మి సీతమ్మ మీద ఆశతో సీతమ్మను అపహరించాడు..

రావణుడు సీతమ్మను తన చెల్లిని అవమానించారని అపహరించలేదు సీతమ్మ మీద ఆశతో అపహరించాడు..

ఇక ఆమెను ముట్టుకోలేదు అంటే రావణునికి ఒక శాపం ఉంటుంది ఆది ఏంటి అంటే
"ఎవరయినా స్త్రీని ఆమె ఆగికారం లేకుండా అనుభవించాలని చూస్తే అతని తల పగిలి చనిపోతాడు"
అందుకే సీతమ్మకు ఒక సంవత్సరం గడువు ఇచ్చాడు అంతలోనే రాముడు వచ్చి యుద్దం చేసి గెలిచి సీతమ్మను తీసుకెళ్లాడు

ఇక రాముడు సీతమ్మను ఒక చాకలి చెప్పాడని అడవులకు పంపాడని అంటున్నాం.. రాజు నిజమయిన పరిపాలన అంటే ప్రజలు ఏది అనుకుంటే అది పాటించడమే..
ఎన్నికల్లో గెలవడానికి వేయి వాగ్దానాలు చెసి ,గెలిచాక వాటిని మర్చిపోయి పాలకులు ఉన్న ఈ కాలం లో రాముడి లాంటి ధర్మ మూర్తి పరిపాలన మనకు అర్ధం కాదు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది