పెద్దలను గౌరవించడం మన బాధ్యత
మిత్రులందరూ దయచేసి చదవండి.........
పెద్దలను గౌరవించండి........
వారి వయస్సును గౌరవించండి.........
వారి మంచి తనాన్ని గౌరవించండి..........
మా ఇంటికి దగ్గర్లో ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టుకింద నేను ప్రతిరోజూ వెళ్ళి నిలబడతాను. నా ఫ్రెండు రోజూ తన కారులో నన్ను ఆఫీసుకు తీసుకుని వెళతాడు......ఇద్దరం ఒకే ఆఫీసు . ఇద్దరం చిన్ననాటి స్నేహితులం.
యధావిదిగా ఆరోజు కూడా చెట్టుకింద నిలబడి నా మిత్రునికోసం ఎదురు చూస్తున్నాను. ఇంతలో ఒక ముసలాయన వేడి వేడి టీని తీసుకుని రోడ్డుదాటి ఆ చెట్టుదగ్గరికి రావడానికి ప్రయత్నిస్తున్నాడు. చెట్టుక్రింద అతని భార్య అనారోగ్యంతో మూలుగుతూ కనిపించింది......
ఆమెకోసం టీ తెస్తున్నాడని నాకు అర్థం అయింది. టీ తీసుకుని రోడ్డు తొందర తొందరగా దాటుతుండగా........వున్నట్టుండి ఓ అమ్మాయి తన స్కూటీని ఆపి ఆ పెద్దాయనను ఇలా అన్నది......
" ఏంటి ముసలాయనా! చావడానికే వచ్చావా? అంత గాబరాగా రోడ్డు దాటుతున్నావు. బుద్ధి లేదా! రాస్కెల్ ! " వచ్చినంత స్పీడుగానే మళ్ళీ వెళ్ళిపోయింది ఆ అమ్మాయి.........
ఇదంతా చూస్తున్న నాకు కోపంతో పాటు బాధకూడా కలిగింది. ఆ పెద్దయన మొహంలోకి చూశాను ఏమైనా బాధపడుతున్నాడేమో అని. కానీ ఆ పెద్దాయన మొహంలో ఆ అమ్మాయి మాటలకు కోపంకానీ బాధకానీ కనిపించలేదు.. టీని తన భార్యకు ఇచ్చి త్రాగమని బ్రతిమాలు తున్నాడు.ఇంతలోనే నా ఫ్రెండు కారు రాగానే బయలుదేరాను.
కానీ, ఆ సంఘటన మాత్రం బాధిస్తునే ఉంది. జరిగినదంతా నా మిత్రునికి చెప్పాను. తను కూడా బాధపడ్డాడు.........
" ఏంటో! ఈ కాలం అమ్మాయిలు మంచి చదువులు వుండికూడా సంస్కారం లేకుండా ఎలా పడితే అలా ఎదుటివారిని మాట్లాడేస్తున్నారు" అనుకుని ఇద్దరం ఆఫీసుకు చేరి మా పనిలో నిమగ్నం అయ్యాము.
మరుసటి రోజు మళ్ళీ అదే ప్రదేశంలో నాకంటే ముందు ఆ పెద్దాయన ఎవరికోసమో ఎదురుచూస్తున్నారు. నేను కూడా వెళ్ళి నిల్చుకుని చూస్తున్నాను. దూరం నుండి అదే అమ్మాయి ఆ దారిలోనే వస్తూవుంది. అది గమనించిన నేను ఆ పెద్దాయన తనను ఆపి తిడతాడేమో అని భావించి అలాగే చూస్తున్నాను.
ఆ అమ్మాయి దగ్గరికి రాగానే ఆమెను ఆపాడు ఆ పెద్దాయన, ఆ అమ్మాయి కూడా నిన్న తిట్టాను కాబట్టి తను కూడా నన్ను తిడాతాడేమో అనుకుని కాస్త భయంగానే స్కూటీని ఆపింది. అప్పుడు ఆ పెద్దాయన చెట్టుకింద ఉన్న ఒక చిన్న సంచిలో నుండి ఆధునికమైన ఒక సెల్ ఫోనును తీసుకొచ్చి
ఆ అమ్మాయికి ఇచ్చాడు.......ఇచ్చి ఇలా అన్నాడు.
" అమ్మా! నిన్న తొందరలో నేను రోడ్డు దాటుతుండగా నువ్వు నన్ను తిట్టెసి వేగంగా వెళుతుండగా నీ బ్యాగులోనుండి ఈ ఫోను పడిపోవడం కూడా చూడకుండా వెళ్ళిపోయావు. నీ కోసమే ప్రొద్ధున నుండి ఇక్కడే చూస్తున్నాను తల్లీ! ఇదిగో నీ ఫోను " అంటూ ఇచ్చాడు తిడటాడేమో అని భావించిన ఆ యువతి తన తొందరపాటు తనాన్ని తెలుసుకుని స్కూటీని పక్కన పార్క్ చేసి ఆ పెద్దాయనకు సారీ చెప్పి కొంత డబ్బును ఇవ్వబోయింది. అతను తీసుకోలేదు. ఆ అమ్మాయి సిగ్గుతో బయలుదేరిపోయింది.
ఇదంతా గమనిస్తూన్న నేను ఆ పెద్దాయన దగ్గరికివెళ్ళి ఇలా అన్నాను. " తాతా! నిన్న జరిగింది.........ఇప్పుడు జరిగినదీ అన్నీ గమనించాను. అయినా తాతా! ఆ అమ్మాయి నిన్ను తిట్టిందికదా! మరి నువ్వు తిరిగి తిట్టకుండా ఆ అమ్మాయి ఫోనును ఎందుకు తిరిగి ఇచ్చావు.
నువ్వే వేరే ఎక్కడైనా అమ్ముకోవచ్చుకదా" దానికి ఆ పెద్దాయన ఇలా అన్నారు నవ్వుతూ........
" ఆ అమ్మయి నా మనవరాలు లాంటిది. ఏదో పని హడావిడిలో నన్ను ఒకమాట అన్నది. మరినేను కూడా అలా రోడ్డుమీద వేగంగా వెళ్ళడం తప్పేకదా! నన్ను తిట్టింది అని నేను ఫోను ఇవ్వకుండా ఉంటే నేను మనిషినే కాదు. తన తప్పును తెలుసుకుని నాకు క్షమాపణ చెప్పివెళ్ళింది అది చాలు కదా!
ఆ సమాధానం విని ఆ పెద్దాయన గొప్ప మనసుకు చేతులెత్తి నమస్కరించాను...........పెద్దలను గౌరవించడం మన బాధ్యత. వారు ఎలాంటి వారైనా వారి వయస్సుకైనా మనం మర్యాదను ఇచ్చితీరాలి కదా! పెద్దలే మన మార్గదర్శకులు.
Source; neethikathulu whatsapp group
