So What!! - నా కేం టి





So What!! - నా కేంటి

అడగకపోతే > పట్టించుకోవట్లేదని,

అడిగితే > అడ్డుపడుతున్నానని,

మౌనంగా ఉంటే > పొగరని,

మాట్లాడితే > ఎదురు తిరిగాననీ...

చూడకుంటే > స్వార్ధం అని,

చూస్తే > తప్పు అని,

ఒక్కడినే ఉంటే >  ఏదీ తోచక అని,

నలుగురితో ఉంటే > పనేమీ లేక అనీ...

మంచి మాటంటే > ఏం ఉద్ధరిస్తావని,

చెప్పకుండా వెళ్తే > ఎక్కడికని,

చెప్పి వెళ్తే > ఎందుకని,

ఎక్కడికీ వెళ్ళకుంటే > ఎందుకెళ్ళడం లేదని,

వెళ్ళక తప్పదంటే > ఎప్పుడొస్తావనీ...

అబ్బాయితో మాట్లాడితే > వీడు తేడా అని,

అమ్మాయితో మాట్లాడితే > వీడికదే పని అని,

పొగిడితే > నిజమేనా అని,

విమర్శిస్తే > నువ్వెవడివనీ...

తిడితే > కోపిష్టి అని,

తప్పులు దిద్దుకోమంటే > రాక్షసుడని,

అప్పిస్తే > మంచివాడని

తిరిగి అడిగితే > చెడ్డవాడనీ...

ప్రశ్నిస్తే > తిక్కలోడని,

బదులిస్తే > బలుపుందని,

ఎదిరిస్తే > ఏం చూసుకొని అనీ...

ఉఫ్...

ఇంకెన్ని నిందలేస్తుందో,
ఇంకెన్ని పేర్లుపెడుతుందో,
ఇంకెంతగా ఆడిపోసుకుంటుందో ఈ ప్రపంచం? ఈ సమాజం?

కాని
ఎవరేమనుకున్నా...
నా కేం టి ( SO WHAT )
అనుకున్నది సాధిస్తా
సమాజం
నవ సమాజం
యవజనం కోసం పనిచేస్తా
మీరు నాతోపాటు సహకరిస్తారంటే

" సై "

చెప్పండి
And give your plan of action/ idea





కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది