Enjoy your Money Wisely

చైనా లో ఒక పెద్ద బిజినెస్ మాన్ చనిపోతూ తన భార్యకు కొన్ని కోట్ల రూపాయలు వదిలి వెళ్ళాడు. అతని భార్య అతని క్రింద పనిచేసే ఉద్యోగినే పెళ్ళిచేసుకుంది...అంత ఆస్థితో వచ్చిన యజమాని భార్యను చూసి అతను, "ఇన్నాళ్ళూ నేను నా బాస్ కోసం పనిచేసాను అని అనుకున్నాను. కానీ నీ భర్త నాకోసమే అహర్నిశలు కష్టపడి ఇంత ఆస్థి కూడబెట్టాడు, బోనస్ గా నిన్ను కూడా నాకు ఇచ్చాడు" అన్నాడట. కటువైన నిజం ఏంటంటే, మనం చనిపోయేనాటికి మన బ్యాంక్ లో చాలా సొమ్ము ఉంటుంది. కాని మనం బ్రతికుండగా దానిని ఖర్చు పెట్టుకోవడానికి వెనుకాడతాము. ( మన తర్వాత మన పిల్లల కోసం కొంచెం దాచడం వరకు సరే,,,కాని ఈక్కడ చెప్తున్నది.. తాము తినకుండా తరతరాలకు దాచేవారి సంగతి ) ఒక్కోసారి ఎవరు ఎవరి కోసం సంపాదిస్తున్నారో అర్ధం కాదు. మనం సంపాదించేది మన కోసమా, ఇతరుల కోసమా అనే సందేహం కూడా వస్తుంటుంది. వయసులో ఉన్నప్పుడు సంపాదనలో పడి తినీ తినక, తాపత్రయపడి వయసు అయిపోయాక అనారోగ్యాలు తెచ్చుకుని ఆస్పత్రులకు పోస్తాం ఆ డబ్బంతా...

*మన దగ్గరుండే ఖరీదైన మొబైల్ లో 70% ఆప్షన్స్ మనకు పనికిరానివే.

**మనం కొన్న విలాసవంతమైన కారులో 70% స్పీడు, మిగిలిన సదుపాయాలు అనవసరమైనవే..

***మనం కొనుక్కున్న విశాలమైన బంగళాలో 70% స్థలం మనవాడుకకు అవసరం లేనిదే.

**** మన అల్మారాలో ఉన్న బట్టల్లో 70% మనం ఎప్పుడో కాని వేసుకోనివే..

*****మనం బ్రతుకంతా కష్టపడి సంపాదించే సొమ్ములో 70% మనకోసం, మనవాళ్ళ కోసం కాక ఇతరుల కోసం ఖర్చు పెట్టేదే....(ఇందుకు అత్యద్భుతమైన ఉదాహరణ ఈకాలం లో జరుగుతున్న పెళ్ళిళ్ళు)

70% గురించి కష్టపడడం తగ్గించి, మిగిలిన 30% పూర్తిగా సద్వినియోగం అయ్యేలా చూసుకుందాం...డబ్బు సంపాదన లోనే జీవితం గడిపేయకుండా జీవితాన్ని అందంగా జీవించడం నేర్చుకుందాం...మనకున్నదానిలొ కొంత పరులకు సహాయం చేసి, మన సంపాదనకు సార్ధకతను కల్పిద్దాం. మన పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ వాళ్ళ పిల్లలు...ఈ గొలుసును ఎక్కడో అక్కడ తెంచి, ఎవరూ లేనివారికి కొంత సహాయం చేద్దాం. నిజమైన తృప్తి అంటే ఏంటో అనుభవిద్దాం.

Source; whatsapp group

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది