ఫోరెన్సిక్ మూలాలు – మన నాడీ జ్యోతిష్యం





ఫోరెన్సిక్ మూలాలు – మన నాడీ జ్యోతిష్యం 

నేటి కాలంలో ఆధార్ కార్డులకు కానీ, ఎన్నో దేశాలలో ఇమ్మిగ్రేషన్ లోను, ఇంకా ఎన్నో ఆధునిక సెక్యూరిటీ చోట్లలో వేలిముద్రలు(బయోమెట్రిక్స్ ) తీసుకుని సరిచూసే పద్ధతి చూసి ఉంటారు. 19వ శతాబ్దం మొదళ్ళలో నేర పరిశోధనా విభాగంలో ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు. ఆస్తి రిజిస్ట్రేషన్ లోను ఇతరత్రా నిర్ధారణకు వాడేవి ఈ వేలిముద్రల పద్ధతి. కానీ మనలో ఎంతమందికి తెలుసు ఈ గొప్ప సెక్యూరిటీ పద్ధతిని కనుక్కున్నది మన భారత ఋషులు అని? 

అత్యంత సెక్యూరిటీ ఉన్న ఈ పద్ధతికి మూలం అగస్త్య మహర్షి కరుణించి ప్రసాదించిన నాడీ విధానం.  వైదీశ్వర కోవెల దగ్గర చెప్పే నాడీ జ్యోతిష్యం గురించి వినని వారు ఉండరు. పూర్వపు తాళపత్రాలు తరచి చూసి ఒకరి వేలిముద్రలు సంపూర్ణంగా విశ్లేషించి ఒకరి భూత, భవిష్య, వర్తమానాలు తెలియచేస్తారు. ఒకరు తమ వేలిముద్ర ఇస్తే దాన్ని తీసుకుని అక్కడ పండితులు అక్కడ తాళపత్రాలను పరిశీలించి కొన్ని ప్రశ్నలు వేసి మరొక అరలో తాళపత్రాలను చూస్తూ మరి కొన్ని ప్రశ్నలు వేసి నిర్ధారించుకుని మన పుట్టిన రోజును లెక్క కట్టి జాతకం చెబుతారు. ఈ పద్ధతిలో ముఖ్యమైన సూత్రం “నాడీ”. ఒకొక్క రాశికి 150 నాడులు ఉంటాయి. 12 రాశులకు మొత్తం 1800 నాడులు. స్థిర, చర, ద్విస్వభావ నాడులు గా విడగొడతారు. ముందు ఒకానొక స్థిరత్వానికి నిర్ధారణ చేసుకుని తరువాత మరింత విశ్లేషించి ప్రోబబిలిటీ +  బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ పద్ధతిలో ఒకరి జాతకం చెబుతారు. కొన్ని వేల తాళపత్రాలలో ఒకొక్క నాడికి సంబంధించిన విశేషాలు వర్ణింపబడి ఉంటాయి. 

కొన్ని శతాబ్దాలనుండి ఈ తాళపత్రాలు వంశపారంపర్యంగా కాపాడబడుతూ ఉండేవి. కొన్ని లక్షల పత్రాలను జాగ్రత్తగా తంజావూరు సరస్వతీ మందిరంలో ఎంతో జాగ్రత్తగా ఔషధులతో, ప్రత్యేక రసాయనాలతో భద్రపరచి ఉండేవి. కాలక్రమేణా వాటిలో కొన్ని ప్రత్యేక శ్రద్ధకు నోచుకోక పాడయ్యాయి. 17వ శతాబ్దంలో బ్రిటిషర్లు ఈ విధంగా చెబుతున్న జ్యోతిష్య విషయాలు తు.చ తప్పకుండా జరగడం చూసి వీటిని నాశనం చేసే క్రమంలో ముందుగా వీటిని వేలానికి పెట్టి కొన్నింటిని వారి దేశానికి, అటునుండి జర్మనీకి పంపారు. కొందరు యోగ్యులు ఆ సమయంలో మిగిలిన సగం ఉన్నవాటిని కొనుగోలు చేసి వైదీశ్వరన్ కోవెలలో దాచిఉంచి, వారి వంశపారంపర్యంగా వాటిని చదివే పద్ధతిని నేర్పారు. 1902 లో మన భారతీయుడు ఒకడు ఈ పద్దతిని మరొక బ్రిటిషేర్ సహాయంతో పూర్తిగా  అధ్యయనం చేసి ఒకొక్కరి వేలిముద్ర ప్రత్యేకత ఉందని ప్రతిపాదించి వాళ్ళ supervisor హెన్రీ పేరు మీద ఒక రెకగ్నిషన్ పద్ధతిని ప్రవేశ పెట్టారు. నేడు కూడా కొన్ని వందల దేశాలలో ఇదే పద్ధతిని పాటిస్తున్నారు అంటే ఆశ్చర్యపోక మానము. 

నాడీ జ్యోతిష్య పద్ధతిలో ఈ వేలి ముద్రలలో ఆర్చ్ (వంపు) , లూప్ , వ్హోర్ల్ (గుచ్చం) అనే మూడు గట్ల ఆకార ప్రమాణంగా వేలిముద్రను విభజిస్తారు. హెన్రీ పద్ధతిలో ముందుగా ఇవే పద్దతితో మొదలుపెట్టి ఫస్ట్ seggregation ( విభజన) చేస్తారు. తరువాత మరింత లోనికి వెళ్లి విభాజిస్తారు. నాడీ పద్ధతిలో 84 వేల రకారకాల లిస్టులు ఉంటాయి. వాటిని ఆధారంగా చేసుకుని పుట్టిన సమయాన్ని బట్టి ఒకరి జాతకాన్ని చెబుతారు. ఇవి నేడు మనం టెక్నాలజీ పరంగా బిగ్ డేటా analysis, డేటా మైనింగ్ అని చెప్పుకుంటున్నాము. డేటా analysis లో బ్రేడ్త్ ఫస్ట్ సెర్చ్ ఆధారంగా ముందు ప్రాధమిక విభజన అనంతరం ప్రశ్న ఆధారంగా సూచిత మార్గాల ద్వారా ఒకరి జాతక కుండలి వద్దకు వస్తారు. అగస్త్య మహాముని కొన్ని లక్షల జీవిత ప్రమాణాలను ప్రవచించారు. ఎన్నో కోల్పోయి కొన్ని నిలుపుకున్న తాళపత్రాల ఆధారంగా నేటికి కూడా చాలా మందికి దాదాపు సరైన అంచనాకు వస్తారు. ఆ జాతక పద్ధతి మరొక సారి ముచ్చటించుకుందాము, కానీ ఇక్కడ మనం తీసుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. నేటి బిగ్ డేటా analytics, ఫోరెన్సిక్ analysis, డేటా మైనింగ్ ఇటువంటి ఎన్నో విషయాలకు మూలాలు  మన శాస్త్రాలలో ఉన్నాయి అని.

మనకున్న శాస్త్రాలను కమ్యునిస్ట్ కళ్ళతో కాక కొంచెం తార్కికంగా విశ్లేషిస్తే రేపటి disruptive టెక్నాలజీ మన దగ్గరనుండే రావచ్చు. మరొక పార్శ్వంతో మన శాస్త్రాలను నమ్మి వాటి ఉపయోగం గురించి ఆలోచించి గొప్ప ఆవిష్కరణలను మన భారతీయులు చేస్తారని ఆశిస్తూ

!! ఓం నమో వేంకటేశాయ !! 
!! సర్వం శ్రీ వేంకటేశ్వరార్పణమస్తు !!




కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది