*"బలగం" సినిమా!*






👆🙏👆

*"బలగం" సినిమా!*
     
మానవ సంబంధాలను సహజంగా ఆవిష్కరించిన గొప్ప సినిమా *"బలగం"*... 

తెలంగాణ పల్లెల్లో ప్రతీ గడపల్లో ఉండే నిజమైన సంఘటనలను మన కళ్ళకు కట్టేలా చూపించిన సినిమా...

బ్రతికున్నప్పుడు, మనకు బంధం అనుబంధాల విలువ తెలియదు... 

ముసలోళ్ళయ్యాక, కనీసం గంజి నీళ్ళు పొయ్యారు... 

కానీ "ప్రాణం" పోయాక "కాకి"కి మాత్రం గొప్పగా పెడ్తేరు....

"రొట్టెలు, పూరిలు వంటి పిండివంటలు, స్వీట్లు, కారాపొట్లాలు, కాస్ట్ లీ స్కాచ్ మందులు, మటన్, బోటి, తలకాయ, చికెన్, చేపల కూరల వంటకాలు ..." 

కానీ మనిషికి "తృప్తి", "ఆనందము" లభించేది, ఈ మటనూ చికెనుల్లో కాదు, మానవ సంబందాల్లో అని, అన్ని పెట్టిన తరువాత "కాకి" ముట్టకుండా వాళ్ళ కొడుకులు బిడ్డలు కలిసాకే, "కాకి" ముట్టిన "కొమురయ్య కథ", నేడు ప్రతీ పల్లెల్లో, దాదాపు ప్రతి ఇంట్లో, ప్రతి పెద్దోళ్ళ గాథ...

"తోడబుట్టిన బంధం" ఎన్ని జన్మలెత్తినా దొరకదు... 

ఒక తల్లికి పుట్టి, పిల్లలుగా ఉన్నప్పుడు, కలిసి మెలిసి, ప్రాణంగా బ్రతికిన అన్నాతమ్ముళ్ళు, అక్కాచెల్లెళ్లు, అన్నాచెల్లెలు, అక్కాతమ్ముళ్ల .... 

వారు పెద్ద వాళ్ళై... 
పెళ్ళిల్లు అవగానే,... 
ప్రతి చిన్న చిన్న విషయాలకు,... 
నేను నాది, నాకు నీకు, నా వాళ్ళు నీ వాళ్ళు,.... 
అంటూ ఆస్థి డబ్బు పంపకాలు, తగాదాలకు,... 
ఏండ్లకు ఏండ్లు కోపాతపాలు పెంచుకుని,...  
సొంత అన్నదమ్ములు, అక్కచెల్లెండ్రలు, అన్నచెల్లెండ్రలు, అక్కాతమ్ముళ్ల...  
హద్దులు గీసుకుని మరీ పంతంగా బ్రతుకుతున్నారు, నేడు ... 

"బలగం" సినిమాలో జస్ట్ "మూలుగ బొక్క" వల్లĺ వచ్చిన పంచాయతి 20 ఏండ్లు "లచ్చవ్వ"ను తన తల్లిగారింటికి దూరం చేసింది...  

తన చెల్లిపై ప్రేమ ఉన్నా బావపై ఉన్న కోపంతో ప్రేమను అణచి వేసుకుని, మనసులో దుఃఖించిన "ఐలయ్య" లెందరో ఈ సమాజంలో...

ఈ సినిమాలో ఒక్కో పాత్ర ఒక అద్బుతం... మానవ సంబంధాలు, అనుబంధాల విలువలు, కోల్పోయిన జీవితం అద్బుతం... భార్యకు భయపడే మొగుడుగా, ఇటు అన్న బందం వీడలేక సతమతమైతూ, అలాగే "దయగల్ల పెద్ద కొడుకా ఐలన్నా'' అంటూ సినిమా చివర్లో కన్నీల్లు పెట్టించిన బుడగజంగాల కళాకారులు...

ఊరు పల్లెటూరు అంటూ బలరామ నరసయ్యో... అంటూ చావు ఊరేగింపును కూడా పండగలా చేసిన మంచి సినిమా... 

స్వంత అక్కచెల్లెళ్ళకు విలువ నియ్యని అన్నలు తమ్ముళ్ళు, మరదలు బామ్మర్థులను చీప్ గా చూసే "బావలు"...

అలాగే అక్కచెల్లెళ్ళ బావలను పట్టించుకోని ధనవంతులైన బామ్మర్దులు, బ్రతికున్నప్పుడు స్వంత తల్లిదండ్రులను, బందాలను పట్టించుకోనోళ్ళు, ఈ సినిమాను తప్పకుండా చూడండి... 

మనస్సుతో చూసాక, మంచి మనిషిగా మారి, ఇంటికెళ్లి మీ వాళ్ళతో సంతోషంగా ఎలాంటి దాపురికలు లేకుండా హాయిగా గడపండి.....

ఇలాంటి మానవ సంబంధాలు, అనుబంధాల విలువలు పెంపొందించే సినిమాలు, మళ్లీ మళ్లీ రావాలి!... 

కఠినాత్ములకు కూడా కన్నీళ్ళను తెప్పించింది, ఈ సినిమా!....... 

సిరిసిల్ల  ముద్దుబిడ్డ, "వెల్దండి వేణు" దర్శకత్వంలో వచ్చిన మంచి మానవ సంబంధాలకు అర్థం చెప్పే సినిమా "బలగం" మీరు మీ కుటుంబ సమేతంగా తప్పకుండా వీలైతే థియేటర్లలో చూడండి. 🙏

ఈ సినిమా చూసి కొంతమంది అయినా మారి వారి కుటుంబ బంధాలకు విలువనిచ్చి సుఖ సంతోషాలతో గడపాలని ఎటువంటి బేసజాలు లేకుండా అందరూ కలిసిమెలిసి వారికి జన్మనిచ్చిన తల్లిదండ్రుల యోగక్షేమాలను చూస్తూ ఉన్నంతలో తృప్తిగా జీవించాలని కోరుకుంటూ....






కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది