నిజం చెప్పాలన్నా
నీతిగా ఉండాలన్నా
సత్యం పలకాలన్నా
చక్కగా ఉండాలన్నా
సంబంధం నిలబెట్టుకోవాలన్నా
దమ్ము, ధైర్యం ఉండాలి.
వంకలతో వైదొలగేవారు,
వారికిష్టమొచ్చినట్టు ఉండాలని,
నానా రకాల సాకులు తెరపైకి తెస్తారు (---------- లేక మంగళ వారం అన్నట్టు).
అయితే, గమనించాల్సిన విషయం
"దాచబడినదేది బయటపడకపోదు
రహస్యమైనదేది బట్టబయలు కాకపోదు".
పిల్లలు ఇంటెనక్కి వెళ్లి మట్టితినేవారు.
బలపాలు, పెన్సిల్, రబ్బర్ లాంటివి
బడినుండి పిల్లాడు తెచ్చినపుడు
సంతోషించిన తల్లి పెద్ద దొంగకు తర్ఫీదు ఇచ్చినట్టే.
కాలేజ్ లో పిల్లాడి హాజరు లేదని తెలిసి, చర్య తీసుకోని తల్లిదండ్రులకు వాడు పక్కదోవ పడుతున్నాడన్న నిజం కనబడదా?
జబ్బుచేసిన వారు తినకూడనివి తింటుంటే, తాగకూడనివి తాగుతుంటే త్వరలోనే పోతారనే నిజం తెలియదా???
కండిషన్లో లేని వాహన (మనం, ఢమరుకం) ప్రయాణం పెనుప్రమాద వారధి అనే వాస్తవం తెలియదా???
మనిషికి సుఖం, సంతోషం, మంచి, మర్యాద లేనపుడు, తెలుసుకోవాలనే ఆలోచన అసలే లేనపుడు, తెలియపరిస్తే కూడా పట్టించుకోనపుడు, వారి మనసులో ఏదో దురుద్దేశం రాజ్యమేలుతున్నదనే నిజం గ్రహించాలి కదా!
నిజం నిప్పులాంటిది, దహిస్తుంది.
మంచెపుడు చేదుగానే ఉంటది.
అబద్దం అందం లాంటిది.
అవాస్తవం make up వంటిది.
అబద్దం, అవాస్తవం లో బ్రతికేవారు
Red light area ను నమ్ముకున్న వారికంటే హీనం.
వారికి మృత్యువే మిత్రుడు.
అందుకే,
దమ్ము, ధైర్యం ఉన్నవారికి
నీతి, నియమాలే జీవిత ప్రమాణాలు.
అబద్దీకులకు కేవలం "సుఖాలే" జీవిత ఏకైక ప్రమాణం.
శుభోదయం