నేడు ఏప్రిల్23 ప్రపంచ పుస్తక దినోత్సవం.
📚📕📘📕📘📕📘📕📘📕📚
📚పుస్తకాన్ని నీవు తల దించుకొని చదివితే - నిన్ను తలెత్తుకొనేలా నడిపించే మార్గదర్శిని అది.
📚పరపంచ ప్రఖ్యాత ఆంగ్ల నాటక రచయిత విలియం షేక్స్ పియర్ వర్థంతి రోజైన ఏప్రిల్ 23ని యునెస్కో అంతర్జాతీయ పుస్తక దినోత్సవంగా ప్రకటించింది.
📚ఈ మేరకు 1995 నుంచి ఏటా పుస్తక దినోత్సవాన్ని జరుపుతున్నారు.
📚ఏటా వంద దేశాల్లో ఈ ఉత్సవం జరుగుతోంది.
📚కుటుంబ సభ్యులు ఆత్మీయులు మరణించిన సందర్భాలలో పుస్తకాలే ప్రియ నేస్తాలై
ఆ బాధను మరచిపోవడానికి దోహదపడినట్టు చిలకమర్తి లక్ష్మీనరసింహం తన అనుభవాన్ని వివరించారు.
📚పుస్తకం లేని గది ఆత్మలేని శరీరం వంటిది
📚అక్షర రూపం దాల్చిన ఒక్క సిరాచుక్క లక్ష మదళ్ళను కదిలిస్తుందన్నారు కాళోజీ.
📚భరత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేడ్కర్ పుస్తకాలు చదివి అపారమైన విజ్ఞానాన్ని సొంతం చేసుకున్నారు.
📚గరంథ పఠనానికే అగ్ర తాంబూలం ఇచ్చి, భోజనం చేయడం మర్చిపోయిన సందర్భాలెన్నో ఆయన జీవితంలో ఉన్నాయి.
📚చరిగిపోయిన వస్త్రాలనైనా ధరించు కానీ, కొత్త పుస్తకం దొరికితే కొనుక్కో అని కందుకూరి వీరేశలింగం ఏనాడో సెలవిచ్చారు.
📚అయితే చెడ్డ పుస్తకాలను చదవడం విషం సేవించడంతో సమానమని లియో టాల్‌స్టాయ్ ప్రవచించారు.
📚పుస్తకం మస్తకానికి మణిహారం.
📚పుస్తకం హస్తభూషణం.
📚పుస్తకం వ్యక్తిత్వ వికాసానికి దర్పణం.
📚పుస్తకం జ్ఞాన సముపార్జనకు సాధనం.
📚పుస్తకం అంధకారాన్ని పారద్రోలే విజ్ఞానపు వెలుగు.
📚ఒక మంచి పుస్తకం మంచి మిత్రుడితో సమానం.
📚ధన సంపాదన కన్నా జ్ఞానసంపాదన మిన్న.
📚పుస్తకం చదివేకొద్దీ పెరుగుతుంది విజ్ఞానం.
📚పుస్తకాన్ని తల దించుకొనిచదివితే - తలెత్తుకొనేలా నడిపించే మార్గదర్శిని.
📚పుస్తకం అజ్ఞానపు అడవిలో దారిచూపే దిక్సూచి.
📚పుస్తకం ఎడారిలో దప్పిక తీర్చే సంద్రం.
📚చరిగిన చొక్కా అయినా తొడుక్కో... కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో.
*నేడు ప్రపంచ పుస్తక దినోత్సవం శుభాకాంక్షలతో...* 🙏💐🙏