[Telugu WhatsApp] మాస్కు ధరించని వారికి 100 రూపాయల జరిమానా | Rs 100 Fine if Found Maskless in AP







మాస్కు ధరించని వారికి 100 రూపాయల జరిమానా | Rs 100 Fine if Found Maskless in AP

బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించని వారికి 100 రూపాయల జరిమానా విధించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి నిరోధానికి మరోమారు మార్గదర్శకాలను విడుదల చేసింది. కేంద్ర హోం శాఖ , ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు , పోలీస్ కమిషనర్ లను ఆదేశించింది. మాస్కు లేని వారిని దుకాణాలు, వాణిజ్య ప్రదేశాలు, వ్యాపార సంస్థల ప్రాంగణాల్లోకి అనుమతిస్తే ...యాజమాన్యానికి 10 వేల నుంచి 25 వేల రూపాయల మేర జరిమానా విధించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉల్లంఘనలు జరిగిన వ్యాపార, వాణిజ్య సంస్థలను 2 రోజుల పాటు మూసివేసేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు



Key Words : Telugu WhatsApp, మాస్కు ధరించని వారికి 100 రూపాయల జరిమానా | Rs 100 Fine if Found Maskless in AP

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది