దేశంలో ఇద్దరికి ఒమిక్రాన్‌ నిర్ధరణ | 2 Omicron Cases Detected in Karnataka





 దేశంలో ఇద్దరికి ఒమిక్రాన్‌ నిర్ధరణ | 2 Omicron Cases Detected in Karnataka

ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న కొవిడ్ మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్ లోకి ప్రవేశించింది. రెండు  ఒమిక్రాన్ కేసులు కర్ణాటకలో వెలుగుచూసినట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్  వెల్లడించారు. కర్ణాటకలోని 66, 46 ఏళ్లున్న ఇద్దరు వ్యక్తులకు ఒమిక్రాన్ నిర్ధరణ అయినట్లు తెలిపారు. బాధితుల్లో తీవ్ర లక్షణాలు కనిపించలేదన్న లవ్ అగర్వాల్ వారితో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించే పనిలో ఉన్నట్లు వెల్లడించారు.



Key Words : Telugu WhatsApp

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది