భగవంతుడు నీకు మిగతావారి కన్నా కాస్త ఎక్కువ డబ్బూ, జ్ఞానం ఇచ్చాడంటే వాటిని నువ్వు మిగతావారికి పంచుతావని..! - యండమూరి వీరేంద్రనాథ్




*భగవంతుడు నీకు మిగతావారి కన్నా కాస్త ఎక్కువ డబ్బూ, జ్ఞానం ఇచ్చాడంటే  వాటిని నువ్వు మిగతావారికి పంచుతావని..! 

*హుండీలో డబ్బు వేస్తే నీకు సంతోషం. సాటి మానవుడికి సాయం చేస్తే మాధవుడికి సంతోషం.

• " కాస్త నిశ్సబ్దంగా ఉండమని మనం పిల్లలకి చాక్లెట్లూ,  బహుమతులూ ఇస్తాo. నువ్వు రోజంతా నిశ్శబ్దంగా ఉండటం కోసం వాళ్ళకి పాతిక వేలు ఇవ్వటం ఎందుకు" అన్నది నా భార్య.  

• మా మామగారు భారతదేశం గర్వించదగ్గ జ్యోతిష్యుడు. తన కూతురికి 'మందస్మిత' అని పేరు పెట్టాడు. "మీ అమ్మాయికి ఆ పేరు ఎందుకు పెట్టారు? చచ్చినా నవ్వటం లేదు" అన్నాను. "పెళ్ళవక ముందు బాగా నవ్వేది" అన్నాడాయన క్లుప్తంగా. 

• శ్వాస మీద ధ్యాస  బాత్‌రూంలో  పెట్టుకో. బయట మాత్రం పని మీద ధ్యాస పెట్టు. ధ్యానం అంటే ముక్కు మూసుకుని స్పృహ కోల్పోవటమూ, ఆ భ్రమలో దేవుణ్ణి చూడటమూ కాదు. చేసే పని మీద ఏకాగ్రత నిలపటo ధ్యానం. పని ని ఆరాదించు. ఆరాధనలోనే 'రాధ' ఉన్నది కదా. 

• నమ్మకానికి వారసుడు ఆంజనేయుడు. సంజీవని తెమ్మంటే హిమాలయాలనే తీసుకొస్తాడు. “హనుమా..! నేను చెప్పగానే ఇది సాధ్యమా కాదా అని ఆలోచించకుండా ఆ పనికి బయలుదేరతావు కదా. నీకేమీ అనుమానాలుండవా?” అని రాముడు అడుగుతాడు. 'రామా! నువ్వు నాకొక పని చెప్పావంటే, ఆ శక్తి కూడా నువ్వే ఇస్తావనే నమ్మకం నాకుంది’ అంటాడు ఆంజనేయుడు. నీలో ఉన్న భగవంతుడి పై నమ్మకo లేకుండా ఎన్ని యజ్ఞాలు చేస్తే ఏమి లాభం? 

*నీ వాత్సల్యం విశ్వజనీయమైనది అయితేే ఆ ప్రేమ కోసం కోసం భగవంతుడు నీ ముందు చేయి సాచి నిలబడతాడు. యశోదకి అంత వాత్సల్యం ఉండబట్టే నోరు చూపించమంటే వినయంగా చేతులు కట్టుకుని చూపించాడు. ‘ఓయమ్మ నీ కుమారుడు’ అని పొరుగింటివారు ఫిర్యాదు చేసినప్పుడు రోటికి కట్టేసినా ఆ దివ్యమంగళుడు కిమ్మనలేదు.


యండమూరి వీరేంద్రనాథ్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది