ఆదర్శవంతమైన విద్యార్థిగా రూపొందించడానికి 16 సూత్రాల ప్రణాళిక





1. గౌరవం: మీ తల్లిదండ్రుల్ని, పెద్దల్ని గౌరవించండి.
2. ప్రేమ : మీ దేశాన్ని మీ సంస్కృతిని మీ పూర్వీకుల్ని నీ ప్రేమించండి .
3. సేవ : పేదలకు నిరక్షరాస్యులకు రోగులకు సేవచేయండి .
4. స్వయం- క్రమశిక్షణ: మీ శరీరాన్ని ఇంద్రియాల్ని మనస్సును క్రమశిక్షణలో ఉంచండి.
5. స్వయం -నియంత్రణ: మీ మాటల్ని ఆలోచనల్ని పనుల్ని స్వాధీనంలో ఉంచుకొo డి
6. విశ్వాసం: మీ మీద ఇతరులమీద భగవంతుని మీద విశ్వాసం కలిగి వుండండి.
7. విచక్షణ: మంచి చెడు నిత్యం అనునిత్యం ధర్మం అధర్మం పట్ల విచక్షణతో ప్రవర్తించండి.
8. ఏకాగ్రత: చదువులో పని లో ఆటలో ప్రార్థనలో సంపూర్ణమైన ఏకాగ్రతను అలవర్చుకోండి.
9. సత్యపాలన:  మీ మాటలలో చేతలలో ఆలోచనలలో సత్యాన్ని పాటించండి.
10. కఠోర పరిశ్రమ : కష్టపడి పనిచేసి జ్ఞానాన్ని ప్రావీణ్యాన్ని వివేకాన్ని సముపార్జించండి.
11.బలం : శారీరకంగా మానసికంగా బుద్ధి పరంగా నైతికంగా ఆధ్యాత్మికంగా బలంగా ఉండండి 
12. నమ్మకం: మంచితనం యొక్క శక్తి మీద పవిత్రత మీద నిజాయితీ మీద నమ్మకాన్ని కలిగి ఉండండి.
13. సమదృష్టి: అన్ని జీవులలో జీవితాన్ని దర్శిస్తూ మిమ్మల్ని మీరు ఆదరించి ఉన్నట్లే వాటిని కూడా ఆచరించండి.
14. దృఢ నిశ్చయం: జీవితంలో శాశ్వతమైన ఆనందాన్ని , శాంతిని
విజయాన్ని ,ధన్యతను పొందడానికి అవసరమైన దూరం చేయాలని మంచి అలవాట్లను పెంపొందించాలని కోవాలన్న గట్టి సంకల్ప బలాన్ని కలిగి ఉండండి.
15. భక్తి : మీ విధుల పట్ల చదువుల పట్ల శాస్త్రాల మీద భగవంతుడి మీద భక్తిని కలిగి ఉండండి.
16. అలవాట్లు : ప్రార్ధన ధ్యానం బలాన్నిచ్చే ఉత్తేజ పరిచే సాహిత్య పఠనం వీటిని తప్పనిసరి అలవాటుగా చేసుకోండి

మీరు జీవితంలో ఏమి కావాలనుకున్నారు ముందుగా నిర్ణయించుకోండి . తప్పకుండా మీరనుకున్న లక్ష్యాన్ని నెరవేరుస్తారు మీ సబ్ కాన్ షస్ మైండ్ కోరిక నెరవేరడానికి మార్గం, తెలుపుతుంది .
పరీక్షలు దగ్గర వస్తున్నాయి అందరూ బాగా చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించండి
తల్లిదండ్రులకు మీ పాఠశాలకు, మీకు విద్యా బోధన చేసిన, గురువులకు మంచి పేరు తీసుకురoడి. ఆల్ ది బెస్ట్👍🎯



Key Words : Telugu WhatsApp

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది