నేడు శ్రీ వీరేశలింగం పంతులు గారి వర్ధంతి.






నేడు శ్రీ వీరేశలింగం పంతులు గారి వర్ధంతి.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

వేదంలా ఘోషించే గోదావరీ
అమరధామంలా శోభిల్లె రాజమహేంద్రీ
శతాబ్దాల చరిత గల సుందర నగరం
గతవైభవ దీప్తులతో కమ్మని కావ్యం

రాజ రాజ నరేంద్రుడు, కాకతీయులు
తేజమున్న మేటి దొరలు రెడ్డి రాజులు
గజపతులు నరపతులు ఏలిన ఊరు
ఆ కథలన్ని నినదించె గౌతమి హొరు ||వేదంలా||

ఆది కవిత నన్నయ్యా వ్రాసెనిచ్చటా
శ్రీనాధ కవి నివాసము పెద్ద ముచ్చటా
కవిసార్వభౌములకిది ఆలవాలము
నవ కవితలు వికసించె నందనవనము ||వేదంలా||

దిట్టమైన శిల్పాల దేవళాలు
కట్టుకథల చిత్రాంగి కనక మేడలు
కొట్టుకొని పోయె కొన్ని కోటిలింగాలు
వీరేశలింగమొకడు మిగిలెను చాలు ||వేదంలా||
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
ఈ పాటవింటే ముందుగా గుర్తొచ్చేది ..........గోదావరి....
ఆఖరున చెప్పినా  మరిచిపోలేనిది....................శ్రీ వీరేశలింగం.

కందుకూరి వీరేశలింగం గొప్ప సంఘ సంస్కర్త, తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి. సంఘ సంస్కరణకు, సామాజిక దురాచారాల నిర్మూలనకు నిరుపమానమైన కృషి చేసిన మహానుభావుడు ఆయన. సాహితీ వ్యాసంగంలోనూ అంతటి కృషి చేసిన కందుకూరి బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు.🌺🌺

శ్రీ గురజాడ వారి రచనలకు వీరి జీవితమే ప్రేరణ! గురజాడవారి 'కన్యాశుల్కం' నాటకం లోని సౌజన్యా రావు పంతులు గారి పాత్ర వీరేశలింగం గారిని దృష్టిలో ఉంచుకొని సృష్టించినదే! 🌺🌺

భారత జాతీయ congress సమావేశాలలో పాల్గొన్నారు. 🌺🌺

గోదావరీ తీరాన కోటిలింగాలు ఉన్నాయి. ఎన్నోలింగాలు నదీ ఉధృతికి కొట్టుకొని పోయాయి. ఒక్క గొప్ప లింగం మిగిలింది,అదే వీరేశ'లింగం'!  అన్నారు మహాకవి ఆరుద్ర.🌺🌺
తెలుగువారిని చైతన్యవంతులుగా చేసిన ఈ మహనీయుడు 27-05-1919 న తమ 71 వ సంవత్సరముల వయసులో, తుది శ్వాస విడిచారు.🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏




కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది