🙏మనస్సును నియంత్రించడం ఎలా...?
🌺🌸🌼🚩🕉🚩🌼🌸🌺
మనస్సు అనేది స్వతహాగా ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటుంది,
భౌతిక ప్రాపంచిక శక్తి చే తయారు చేయబడినది కావున, సహజంగానే భౌతిక సుఖాల వైపు మొగ్గు చూపుతుంది.
మన మనస్సు యొక్క ఆలోచనలను అనుసరిస్తే, మనం ఇంకా ఇంకా భౌతిక ప్రాపంచికత లోతుకు దిగబడుతాము.
ఈ మరింత క్రిందిక్రిందికి దిగజారిపోవటాన్ని నిరోధించాలంటే మనస్సుని బుద్ధి యొక్క సహాయంతో నియంత్రించాలి. దీనికోసం బుద్ధిని యదార్ధమైన జ్ఞానం చే శక్తివంతం చేయాలి.
ఎవరైతే, భగవంతుడిని పరమాత్మ స్వరూపంలో సర్వ భూతములలో దర్శిస్తారో, వారు ఈ జ్ఞానమునకు అనుగుణంగా బ్రతుకుతారు.
ఇతరులతో తమకున్న సంబంధం నుండి వ్యక్తిగత లాభము మరియు స్వార్థ సుఖానుభవములను పొందటానికి ఆశింపరు.
వారు చేసిన మంచి చేత వారిపట్ల మమకారం పెంచుకోరు, లేదా వారు చేసిన కీడు వల్ల వారిని ద్వేషింపరు.
అంతేకాక, ప్రతివ్యక్తినీ భగవంతుని అంశగా చూస్తూ, అందరి పట్ల చక్కటి ఆదరాన్ని, సేవా భావమును చూపుతారు.
సహజంగానే వారు, అందరిలో ఉన్న భగవంతుడిని చూసినప్పుడు, ఇతరులను దుర్భాషలాడటం, మోసం చేయటం, లేదా అవమానించటం వంటి పనులను చేయరు.
మరియు, మానవ జనితములైన వివక్షలు - జాతీయత, మతము, కులము, లింగ బేధము, హోదా, వర్ణము – వంటి వన్నీ అసందర్భమైనవిగా అయిపోతాయి.
ఈ విధంగా వారు అందరిలో భగవంతుడిని దర్శించటం ద్వారా తమ మనస్సులను ఉన్నత స్థాయికి తీసుకు వెళతారు మరియు చిట్టచివరికి సర్వోత్కృష్ట లక్ష్యమును చేరుకుంటారు.
🌺🌸🌼🚩🕉🚩🌼🌸🌺
Key Words : Telugu WhatsApp