కుజ గ్రహ దోషము





🙏కుజ గ్రహ దోషము

పెళ్లి అనగానే గుర్తుకొచ్చే వాటిలో గ్రహపర దోషములలో కుజ దోషము ఒకటి. ఏవిధముగా నయితే ఏలినాటి శని దోషము, కాలసర్ప లేదా రాహు కేతు దోషము ఏవిధముగా ప్రజలలో భయమును కలిగించినారో అదేవిధముగా కుజ దోషము అంటే భయాన్ని కలిగించారు.

ప్రతీసారి ఈ విషయాన్నీ చెప్పడము జరుగుతుంది. గ్రహ దోషము అంటే అదేదో గ్రహము తానంతట అదే ఇచ్చే ఫలము అని అనుకోవడము పెద్దపొరపాటు తెచ్చిపెట్టింది, ఈ భయము శాస్త్రకారుల వలన వచ్చినదే తప్ప వేరే కాదు. శాస్త్రము మానవునికి ధైర్యాన్ని పెంచాలి ధర్మ మార్గాన్ని చూపాలి అటువంటిదే శాస్త్రము. 

గ్రహ దోషము అంటే నీవు చేసిన పాప కర్మను తెలిపేది. అంటే నీవు పూర్వ జన్మలో చేసిన పాపము కర్మల ఫలము ఈ జన్మలో దోషముగా చెప్పబడుతున్నది అని తెలిపే వారు కరువయి భయాన్ని కలిగించి దోచుకునే వారు తయారయిన కాలము ఇప్పుడు ఉన్నది కావున నీవు చేసిన పూర్వకర్మల తప్పులు ఏమిటో తెలిపేది గ్రహదోషము. 

కుజదోషము అందరికి ఉండదు అలాగని కెవలము ఒక్క కళ్యాణమునకే కుజ దోషము అనేది ఉండదు. ఈ చరాచర జగత్తును పాలించుటకు నవగ్రహములలో స్థానము కుజునికి కలిగించినాడు. కుజుడు గొప్పవాడు, లోక రక్షకుడు, మహా యోధుడు, దైవాంశ సంభూతుడు, యవ్వన కారకుడు, పురుష కారకుడు. కాని కుజుడిని క్రూరునిగా పూర్వులు చెప్పినారు ఇదే లోకమునకు అరిష్టాన్ని తెచ్చినది. ఉత్తమమయిన మంగళ వారమును అమంగళగా మార్చినారు, మంగళము అంటేనే శుభకరము కాని ఇప్పుడు మంగళవారము అంటేనే వర్జింపవలసిన పాపపు కాలము దాపురించినది.

కుజుడు తేజోమయుడు, భూసుతుడు, రక్షకుడు, విష్ణు అంశ, సైన్యాధికారి. కుజ అనుగ్రము లేకుంటే ఏ సైన్యముకుడా యుద్ధరంగములో జయమును సాధించలేదు. అసలు కుజుడిని క్రూరుడు అనడమే మహా పాపము, ఈ పాపఫలమే ఇప్పుడు లోకములో విపరీతమయిన ఉద్రేకమయిన చర్యలను పురిగొల్పుతుంది. 
దైవాన్ని దూషిస్తే దాని ఫలితము తప్పక అనుభవింపవలసిందే.

** కుజదోషము అందరికి వర్తిస్తుందా?
కుజుడు 12 లగ్నములలో మేష, కటక, సింహ, వృచ్చిక, ధనుస్సు, మీన లగ్నములకు శుభుడు. ఈ 6 లగ్నములకు కుజుడు దైవముతో సమానము. వీరికి మంగళవారము శుభము , వీరికి కుజదోషము ఉండదు. కాని ఈ 6 లగ్నములకు కుజయోగ భంగము ఉంటుంది కాని దోషము ఉండదు. కుజుడు ఈ లగ్నములకు యోగాకారకుడు. 

దోషము అంటే పాపకర్మ ఫలము పాపమును అనుభవింప చేస్తుంది, యోగము అంటే పుణ్యకర్మ ఫలము అనుభవింప చేస్తుంది, యోగ భంగము అంటే శుభ ఫలము నాశనము అవడము. 

మిగిలిన 6 లగ్నములు అయిన వృషభ, మిథున, కన్య, తుల, మకర, కుంభ లగ్న జాతకులకు కుజ దోషము ఉంటుంది, ఈ 6 లగ్నమునకు కుజుడు ఆశుభుడు(పాప గ్రహము అనగా పాప కర్మను అనుభవింపచేయువాడు), వీరికి కుజుడు భాధనీయుడు వీరికి కుజదోషము కీడు కలిగిస్తుంది.

అందరికి కుజదోషము వర్తించదు. 

మేష, కటక, సింహ, వృచ్చిక, ధనుస్సు, మీన లగ్నములకు కుజుడు శుభుడు వీరికి కుజదోషము వర్తించదు, కుజుడు యోగకారకుడు.

వృషభ, మిథున, కన్య, తుల, మకర, కుంభ లగ్న జాతకులకు కుజుడు ఆశుభుడు వీరికి కుజదోషము వర్తిస్తుంది, కుజుడు వియోగకారకుడు.

** కుజదోషము అంటే వివాహపరముగా మాత్రమె ఉంటుందా?
ఇది చాల పెద్ద పొరపాటును తీసుకొచ్చింది. కుజదోషము అంటే కేవలము వివాహ పరముగా ఉంటుంది అనెడి సరి అయింది కాదు, వివాహమునకు 9 గ్రహములలో ఏ గ్రహమయినా కారణము కావొచ్చు. కళ్యాణమునకు ఆలస్యము ఆటంకములు శుక్రుడు కావోచ్చో, గురువు కావొచ్చు, శని కావొచ్చు, బుధుడు కావొచ్చు, రవి కావొచ్చు, చంద్రుడు కావొచ్చు, రాహు కేతువులు కావొచ్చు అంతే కాని కేవలము కుజుడే దోషము కలిగిస్తాడు అనుకొనుట పొరపాటు. 

వివాహానికి ముఖ్య స్థానములు 7, 8 మరియు లగ్న, ద్వితీయములు ఈ స్థానములలో ఉండే అశుభగ్రహములు చూచే గ్రహములు మరియు కళత్ర కారకుడు శుక్రుడు శుభుడా ఆశుభుడా ఎక్కడ ఉన్నది మరియు సప్తమాధిపతిని ఎవరు చూస్తున్నారు అనేవి వివాహ ఆటంకములకు కారణము అవుతాయి తప్ప కేవలము కుజుడు మాత్రమే అని చెప్పుట సబబు కాదు.

** కుజదోశమును ఏవిధముగా గుర్తించాలి?
వృషభ, మిథున, కన్య, తుల, మకర, కుంభ లగ్న జాతకులకు కుజుడు ఆశుభుడు. వీరికి మాత్రమే కుజ దోషము ఇబ్బందులు కలిగిస్తాయి. వీరికి జన్మ లగ్నములో కుజుడు ఏ భావములో ఉన్నాడో ఎక్కడ చూస్తున్నాడో అక్కడి ఫలములు నాశనము చేయును. ఏ భావములో ఉన్నాడో ఏ భావములని చూస్తున్నాడో ఎంత బలముగా చూస్తున్నాడో అక్కడ కుజదోషప్రభావము ఆ జాతకున్ని ఇబ్బందులు కలిగిస్తాయి అని గమనించవలెను.

** కుజుడు క్రూరుడా?
కుజుడు అనే కాదు ఏ గ్రహమునకు క్రూరత్వము లేదు. నవగ్రహములలలో క్రూరులు లేరు. అందరూ పూజనీయులే. అందరూ దైవసమానులే. క్రూరమనే శబ్దము కారకముగా మాత్రమే ఉన్నది తప్ప గ్రహ స్వభావముగా లేదు, ఈ క్రూర శబ్దము శాస్త్రమును తలకిందులు చేసినది.

** కుజ యోగము వలన ఎటువంటి శుభ ఫలితములు కలుగును?
అంగబలము, ధైర్యము, స్థైర్యము, యవ్వనము, వీర్యబలము, శత్రు భేదనము, యవ్వనములో వివాహము, అన్నదమ్ముల సౌఖ్యము, భూ సంపద, వన సంపద, శిలాసంపద, జ్ఞానము, శక్తి మొదలగు కుజ కారకత్వ శుభ ఫలములు కలుగును. కుజుడు శుభుడై ఏ భావములో ఉంటాడో అక్కడి కారకముల ఫలముతో ఆ జాతకుడు సుఖపడును. ఉదా: కుజుడు శుభుడై చతుర్థములో ఉంటె భూమి, పొలములు, స్థలములకు లోటులేకుండా కలిగించును.

** కుజ దోషము వలన ఎటువంటి అశుభ ఫలితములు కలుగును?
కోర్టు, పోలీస్ వ్యవహారములలో ఇబ్బందులు, యవ్వనము వృధా అయియా వివాహము కాలము ఉదా అగును, కాళ్ళు చేతులలో లోపము, విరగడము తెగిపోవడము, అన్నదమ్ముల మధ్య సౌఖ్యము లేక గొడవలు కలిగి విడిపోవడము, దూరమవడము, రక్త హీనత, నరాల బలాహీనత, శత్రుభయము, భూ వివాదాలు మొదలగు కుజ కారకత్వాముల వలన ఇబ్బందులు కలుగును.
ఉదా: కుజుడు ఆశుభుడై చతుర్థములో ఉంటె భూమి లేకుండా చేస్తాడు, భూమి ఇంకొకరి పాలు చేస్తాడు, కేసులలో ఇరుక్కోవాల్సి వస్తుంది వాటివలన ఇబ్బండ్లు పడుట తప్పదు. Copy from శ్రీజ్యోతిష్యవాస్తు ప్రభోధిని




కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది