మీ ఇంట్లో పదే పదే "అశుభాలు" కలుగుతున్నాయా





🙏మీ ఇంట్లో పదే పదే "అశుభాలు" కలుగుతున్నాయా... 
అయితే ఇలా చేయండి..
మనము మాములుగా ఇంట్లో మన పూర్వీకులు లేదా పెద్దవాళ్ళు చనిపోయినప్పుడు పిండప్రదానం కార్యక్రమం ఆ సమయంలో చేస్తాం. కానీ ప్రతి ఏడాది తప్పకుండా పిండప్రదానం చేయాలి. ఇలా చేయకపోవడం వలన పితృదోషాలు అంటుకుని ఇంట్లో అపశకునాలు అశుభాలు జరుగుతాయి. దీనిని హిందుమతాన్ని ఆచరించే ప్రతి ఇంట్లోనూ ఇంతకుముందు తరాల వారికి శ్రాద్ధ కర్మలను చేయడం, పిండాలను అర్పించడం తప్పనిసరి అని శాస్త్రాల్లో పేర్కొన్నారు. ఒకవేళ ఈ విధంగా చేయనట్లయితే కొన్ని అనుకోని ఆందోళనలు, అశుభ సంకేతాలతో ప్రజలు కలవరపడతారు. అంటే వారి పితృ దోషాలు అంటుకుంటాయని చెబుతారు. మరి ఈ దోషాలు అంటుకున్నప్పుడు ఇంట్లో కొన్ని అపశకునాలు, లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాకుండా సాధారణంగా మనము బోజనం చేసేటప్పుడు ఆహారంలో వెంట్రుకలు కనిపిస్తూ ఉంటాయి. ఎక్కువగా వెంట్రుకలు కనిపిస్తుంటే ఈ విషయాన్ని అంత సులభంగా వదలకూడదు. కుటుంబ సభ్యులు భోజనం చేసేటప్పుడు చాలాసార్లు జుట్టు వస్తుంటుంది. అది ఎక్కడ నుంచి వచ్చిందో ఎవరికి అంతుపట్టదు. ఇంట్లోనే కాదు వారు బయటకు వెళ్లి రెస్టారెంట్లు, హోటెళ్లో తినాల్సివచ్చినా ఆహారంలో వెంట్రుకలు వస్తాయి. కొన్ని సార్లు ఎదుటివారు ఎగతాళి చేస్తారు. ఈ విధంగా తరచూ జరుగుతూ ఉంటే మీ జాతకాన్ని ఓ సారి జ్యోతిష్కుడికి చూపించు కుంటే మంచిది. ఇల్లు ఎంత శుభ్రంగా, అందంగా ఉన్నప్పటికీ దుర్వాసన వస్తుందంటే ఆ విషయాన్ని ఊరికే వదిలిపెట్టకూడదు. అసలు చెడువాసన ఎక్కడ నుంచి వస్తుందో అర్థం కాదు. అసలు అక్కడ ఏమి లేకపోయినప్పటికీ చెడు వాసన వస్తుందని బయట నుంచి వచ్చిన వాళ్లు అంటుంటారు. ఈ విధంగా దుర్వాసన వస్తుందంటే పూర్వీకులకు కోపం వచ్చిందని అర్థం చేసుకోవాలి. పితృ దోషాలు వల్ల ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. చనిపోయిన బంధువులు, పూర్వీకులు తరచూ కలలోకి వస్తున్నారని కొంతమంది చెబుతుంటారు. ఈ అంశాన్ని యాదృచ్ఛికమని చెప్పలేం. పూర్వీకుల గురించి పదేపదే కలలు కనడమంటే వారి కోరికలు ఇంకా అసంపూర్ణంగా ఉన్నాయని కొంతమంది నమ్ముతుంటారు. ఒకవేళ మీకు కూడా ఈ విధంగా జరుగుతున్నట్లయితే చనిపోయిన మీ పూర్వీకులు, బంధువులకు ఇష్టమైన వస్తువులను అవసరమైన వారికి దానం చేస్తే మంచిది.

(సేకరణ: పరాశరం గోపాల్ గారి పోష్టు)




కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది