ప్రతి ఓటరు చదవాల్సిన మెసేజ్
అన్నా స్కూలు పోతాడట ...
15 వేలు తీసుకో
అన్నా ఆటో తోలుతా ...
10 వేలు తీసుకో
అన్నా కటింగ్ చేస్తా ..
10 వేలు తీసుకో
అన్నా ముసలోడిని ...
2250 తీసుకో
అన్న నేను మహిళని ...
15 వేలు తీసుకో
అన్న నేను కాపును ..
15 వేలు తీసుకో
అన్నా నేను బట్టలు కుట్టే టైలర్ ని ....
10 వేలు తీసుకో ..
అన్నా నేను జాలరి ని ...
అవునా ..
అయితే 10 వేలు తీసుకో ....
ఒక పిట్ట కథ విందామా ?
ఒక దొర ఊర్లో డబ్బులు పంచుతాను రండి అని డప్పు వేయించాడు.
దొర గారు డబ్బులు పంచుతున్నారట ... అని ఊర్లో అందరూ పరుగెత్తుకుంటూ వెళ్లారు.
అందరినీ ఊరి బయటున్న స్టేడియంలోకి తీసుకెళ్లారు వచ్చినోళ్లందరికీ అందరికీ
డబ్బులు పంచాడు దొరగారు.
డబ్బులు తీసుకుని ఊర్లో కెళుతంటే పోయేటపుడు కనిపించని టోల్ గేట్ ఈసారి ప్రత్యక్షమైంది.
అందులో లోపలికి వెళ్లినా 4 రూపాయలు కట్టాలి,
బయటకు వచ్చినా నాలుగు రూపాయలు కట్టాలి.
దొరగారు ఇచ్చిన డబ్బులు
నెలరోజుల్లే ఆ టోల్ కి సరిపోయాయి.
మిగతా 11 నెలలు జనం కష్టపడి సంపాదించి ఆ టోల్ కట్టారు.
ప్రభుత్వాలకు రాజ్యాంగం పన్నులు వసూలు చేసుకునే హక్కు కల్పించింది ఎందుకు ?...
మనంతట మనమే రోడ్డేసుకోలేం,
బడి కట్టుకోలేం,
గుడి కట్టుకోలేం
ఆస్పత్రి కట్టుకోలేం.
ఆ పనుల్నీ చేయడానికి ఒక వ్యవస్థను పెట్టిన దానికి గవర్నమెంటు అని పేరు పెట్టారు.
ఆ గవర్నమెంటు వ్యవస్థకు మన పన్నులకు తగ్గ పనులు చేసిపెట్టే బాధ్యత అప్పగించారు. అందుకోసం ట్యాక్సుల రూపంలో
మన డబ్బులు తీసుకుని
మనకోసం బడి కట్టాలి,
రోడ్డు వేయాలి,
ఆస్పత్రి కట్టాలి,
కరెంటు తయారుచేయాలి,
డ్రైనేజీలు వేయాలి.
చెరువులు కట్టాలి.
ప్రాజెక్టులు కట్టాలి.
కానీ మనం కట్టిన డబ్బులను నాయకులు తమ పేర్లు తమ తండ్రుల పేర్లు పెట్టుకుని
తమకు నచ్చిన వాళ్లకు పంచుతున్నారు .
కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి .
ఏపీలో కరిగేపోయాయి .
మొన్నే 40 వేల కోట్లు డబ్బులు పంచాం అని ఘనంగా చెప్పుకున్నారు .
ఎవరి సొమ్ము అది?
ప్రజలు కట్టిన పన్నులే కదా . ముఖ్యమంత్రుల సొంత సొమ్ములు కావు కదా!
మరి వాటిని ఇష్టారాజ్యంగా పంచుతుంటే ప్రజలు ప్రశ్నించాలి కదా .
రేపటి నుంచి ....
ఏపీలో ఇతర రాష్ట్రాల కంటే
4 రూపాయలు ఎక్కువ పెట్టి
పెట్రోలు కొనాలి
ఏపీలో ఇతర రాష్ట్రాల కంటే
4 రూపాయలు ఎక్కువ పెట్టి
డీజిల్ కొనాలి
ఇప్పటికే ఇతర రాష్ట్రాల కంటే
75 రూపాయలు ఎక్కువ పెట్టి
క్వార్టర్ కొంటున్నారు .
ఇదే పన్ను మిగతా రాష్ట్రాల్లో వేశారనుకో ...
జనం పాలకులను నిలదీస్తారు. కడిగేస్తారు .
ఎందుకంటే వారు అడ్డదిడ్డంగా అప్పనంగా గవర్నమెంటు డబ్బులు తినలేదు .
కాబట్టి మూసుకుని కూర్చోరు . తాటతీస్తారు .
కానీ ఏపీ ప్రజలు పుడితే పథకం, చదివితే పథకం,
పెద్దయితే పథకం,
స్కూలుకెళితే పథకం,
సంఘానికెళితే పథకం,
వ్యవసాయం చేస్తే పథకం,
పెళ్లి చేసుకుంటే పథకం ...
పెంచడం కష్టం గాని
పంచడం ఎంత సేపు
5 నిమిషాల పని .
ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు .
డబ్బులు ఇస్తున్నపుడు సంతోషంగా తీసుకున్నారు .
మరి ఎక్కడి నుంచి వస్తాయి
తిరిగి కట్టకపోతే .
అదే జరుగుతోంది .
చాలా సింపుల్ లాజిక్ ...
*మనం డబ్బులు ట్యాక్సుల రూపంలో కడితేనే గవర్నమెంటు వద్ద డబ్బులుంటాయి.*
ఆ డబ్బులను ఎలా వాడితే ప్రజల జీవితాలు బాగుపడతాయి అన్నది *నాయకుడిని* బట్టి ఉంటుంది .
అందుకే అన్నారు
*దురాశ దు:ఖానికి చేటు* అని .
ఓ ఓటరు మహాశయా మేలుకో
ఉచితంగా ఏది రాదు ...
అనేది అందరూ అర్థం చేసుకోవాలి ...