జీవితమే ఒక ప్రయాణం..





🟩🟦🟩

జీవితమే ఒక ప్రయాణం..
ఆ ప్రయాణంలో కలిసే ప్రయాణికులు ఎందరో 
కానీ.. 
ఏదీ, ఎవరూ శాశ్వతం కాదు
 కేవలం నువ్వే శాశ్వతం
 నీ నడవడికే శాశ్వతం 
గెలిచేది నువ్వే.. 
ఓడేది కూడా నువ్వే
 గెలుపుకి పొంగిపోకుండా.. 
ఓటమికి కృంగిపోకుండా 
ధర్మ బద్ధంగా 
ఫలాపేక్ష లేకుండా
 తోటివారికి సాయపడుతూ 
సాగిపోవడమే జీవితం 
అదే నీ కర్తవ్యం..!!

🟩🟦🟩 🟦🟩🟦 🟩🟦🟩
 *🌳 పరకృతిని ప్రేమిద్దాం 🌳*
*💚  పచ్చదనం కాపాడుకుందాం  💚*


*✳️ LOVE NATURE ✳️*
🌳🌳

 మేడ్ ఫర్ ఈచ్ అదర్ 
అంటే అర్థం 
మన ఎత్తుకు పర్సనలీటి కి సరిపోయే మనిషి అని కాదు.
 
మన ఆలోచనలకు , 
మన అభిప్రాయాలకు , 
 మనస్తత్వానికి దగ్గరగా ఉండే మనిషి అని అర్థం.

 మన బలహీనతలను అర్థం చేసుకొనే 
జీవిత భాగస్వామి దొరకడం చాలా అదృష్టం.


🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳
 🌷🌷


జీవితం (Life) ఎప్పుడూ ఒకేలా ఉండదు. 

కొన్ని రోజులు మనమెంతో ఆనందంగా జీవిస్తే ..
 మరికొన్నిసార్లు ప్రపంచంలోని కష్టాలన్నీ 
మనకే ఉన్నాయని అనిపిస్తుంది. 

ఎప్పటికప్పుడు జీవితమనేది కొత్తగానే కనిపిస్తుంది. 

కొందరు వయసు పెరుగుతుంటే.. 
కష్టాలు తగ్గుతాయేమోనని అనుకుంటారు. 
కానీ అందరి విషయంలోనూ ఇది సరికాదు. 

అయితే పెరిగే వయసుతో పాటు..
 ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ ముందుకెళ్తాం.


🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷




కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది