అమెరికాలోని ఒక నిరుపేద నీగ్రో కుటుంబంలో పుడుతూనే బానిసగా జన్మించాడు.
తండ్రిని బాల్యంలోనే కోల్పోయాడు.
తనను, తన తల్లిని బానిసలుగా అమ్మడానికి ప్రయత్నించిన వర్తకులు తల్లిని అమ్మేశారు.
కానీ జబ్బుపడ్డ అతడిని కష్టపడటానికి పనికిరాడని ఒక పండ్ల తోట వద్ద వదిలి వెళ్లిపోయారు.
ఖాళీ సమయాల్లో బట్టలు ఇస్త్రీ చేయగా వచ్చిన డబ్బుతో.. వృక్షశాస్త్రాన్ని మధించి దాదాపు మొక్కలకు వచ్చే అన్ని రకాల వ్యాధులకు 300 రకాల మందులను వృక్షశాస్త్ర మెళకువలతోనే కనిపెట్టాడు. అతని క్రమశిక్షణ, అంకితభావం, మేధస్సు చూసి సంవత్సరానికి లక్ష డాలర్లు ఇస్తానని, తనతో కలిసి పని చేయాలని కోరాడు థామస్ ఆల్వా ఎడిసన్. కానీ తన కాలేజీలోనే తన విద్యను, పరిశోధనల ఫలితాలను అందరికీ పంచుతాననీ తద్వారా అమెరికా వ్యవసాయరంగం అతి తక్కువ ఖర్చులో ఎక్కువ ఉత్పాదకత గల దేశంగా అవతరించగలదని నమ్మి అనుకున్నది సాధించాడు. ‘నేను తయారుచేసిందంతా భగవంతుడు నాకు ఇచ్చింది. దాన్ని వేరొకరి లాభం కోసం ఎలా అమ్మగలను’ అనేవాడాయన. దేశమంతా లక్షలాది రైతులకు ఉచితంగా తన పరిశోధనల సారాన్ని అందించి వారిని, వారి పంటలను ఎప్పటికీ సురక్షితంగా ఉండేలా తోడ్పడ్డాడు.
ఆయన మరణించిన తర్వాత ఆయన సమాధిమీద ఇలా రాసి ఉంది.
"He could have added fortune to fame, but caring for neither he found happiness and honour in being helpful to the World''
‘‘కావాలనుకుంటే కీర్తితోపాటు సంపద కూడా వచ్చేది కానీ రెంటినీ లెక్కచేయక తన ఆనందం, గౌరవం ప్రపంచానికి సాయపడడంలోనే ఉంది అని భావించాడు’’ ఆయనే *జార్జి వాషింగ్టన్ కార్వర్*. చిన్న విషయాన్ని కనిపెట్టినా పేటెంటు కోసం పరుగులు పెట్టి రాయల్టీ కోసం రాద్ధాంతం చేసే రోజుల్లో ఒక్క పేటెంటు తీసుకోకుండా లాభాపేక్ష లేకుండా తనదేశ రైతులు పదికాలాలపాటు చల్లగా ఉండాలన్న అతని తపన అందరికి ఆదర్శనీయం. తన జీతంలో పొదుపు చేసిన మొత్తంతో కార్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు.
ఎదుటి వారి ఆనందంలో మన ఆనందం వెతుక్కున్నప్పుడు మన జీవితమే మనకి కొత్తగాఅధ్బుతంగా కనిపిస్తుంది. మనిషిగా మన చేతిలో ఉంది ఎదుటివాడికి సహాయపడటమే..