మంచి స్నేహితులను, సంభంధాలను....!





ఒక చిన్న పాప తన రెండు చేతులలో రెండు ఆపిల్సు పట్టుకుని ఉంది.
.
.
అది చూసిన ఆ పాప అమ్మ,, నవ్వుతూ "నాకు కూడా ఒక ఆపిల్ ఇవ్వు తల్లీ....!!!" అని గారాభం గా అడిగింది.
.
.
అది విన్న ఆ పాప, వెంటనే ఒక ఆపిల్ ను కొరికి ఎంగిలి చేసింది. రెండో ఆపిల్ ఇస్తుందనుకొనేలా, ఆ పాప రెండవ ఆపిల్ ను కూడా ఎంగిలి చేసింది.
.
అది చూసి, అమ్మ మొహం మీది నవ్వు మాయమైంది. ఆ చిన్న వయసులో తన కూతురి స్వార్థం చూసి, ఆ తల్లి మనసు గాయపడింది. మారు మాడ్లాడక, అక్కడ నుండి పోబోయింది.
.
అంతలో, ఆ పాప ఒక చేయి ముందుకు చాచి "అమ్మా..! ఈ ఆపిల్ తీయగా ఉంది. ఇది తీసకో" అంది......
.
.
.
జీవితం లో కూడా మనలో చాలా మంది, ఎదుటి వారి భావనలను అర్థం చేసుకోక, తొందరపాటు నిర్ణయాలు తీస్కుంటాం...!! మంచి స్నేహితులను, సంభంధాలను కోల్పోతాం....!




కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది