అప్పుడే పుట్టిన బిడ్డ ఎందుకు ఏడుస్తుందో మీకు తెలుసా?





అప్పుడే పుట్టిన బిడ్డ ఎందుకు ఏడుస్తుందో మీకు తెలుసా? 

తెలియకపోతే తెలుసుకోండి.. 
ఈ రోజో...నిన్ననో పుట్టిన బిడ్డ బాగా ఏడుస్తూనే ఉండటం మనం 
చూస్తూనే ఉంటాము... ఈ బిడ్డ ఎందుకు ఏడుస్తుందో అని తెలుసుకోవాలని 
ఉన్నా ఏవో కారణాల వలన తెలుసుకోలేకపోయి ఉండవచ్చు.. 
నిజంగా ఓ బిడ్డ పుట్టగానే ఎందుకు ఏడుస్తుంది అంటే...  
అమ్మ కడుపులో ఉన్న ఆ 10 నెలలు లయబద్ధకంగా వినపడే గుండె చప్పుడును 
వింటూ తన్మయం చెందుతూ ఉంటుంది. ఆ చప్పుడులో తనను తాను 
మరచిపోయి ఆ చప్పుడే తనకు రక్షణగా భావిస్తూ ఉంటుంది. 
బయటి ప్రపంచంలోకి రాగానే ఆ చప్పుడు దూరమై తనకు ఏదో అవుతోంది 
అని భయంతో వెక్కి వెక్కి ఏడుస్తుంది ఆ బిడ్డ, ఆ ఏడుపు ఆ తల్లి 
ఒడిలోకి చేరగానే ఆపేస్తుంది గమనించండి. తల్లి తనను దగ్గరకు 
తీసుకోగానే మళ్ళి ఆ గుండె చప్పుడు విని తనకు ఏమీ భయం లేదని 
ఆ బిడ్డకు తెలిసిపోతుంది..  
నిజంగా తల్లిమీద ఆ పసికూనకు ఎంత నమ్మకమో కదా! అమ్మ ప్రేమకు 
అనురాగానికీ సాటి లేదు.. చివరికి తన గుండె చప్పుడు కూడా ఆ బిడ్డకే అంకితం చేసే అమ్మతననికి నా శాతకోటి వందనాలు! 
నాకు ఈ ప్రపంచం లో అమ్మ తరువాతే ఎవరైనా.. 
ఫ్రెండ్స్ అమ్మ తిట్టిందనో,కొట్టిందనో,నాకేది చేయలేదనో అమ్మను దూరం చేసుకోకు మిత్రమా మనకు ఆమె జన్మనివ్వడం ఒక్కటి చాలు మనం జీవితాంతం ఆమెకు ఋణపడి ఉండడానికి... 
So friends అమ్మ మనల్ని చూసుకొన్నంతగా కాకపోయినా దానిలో అణువంతయిన చూస్తారని భవిస్తూ...




కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది