మాటలకందని ఒక బీద రైతు(వ్యాపారి) కన్నీటి గాధ...!!
మిత్రులకు చిన్న విన్నపం...!!
నేను ఈరోజు మార్కెట్లో కోబ్బరి బొండం త్రాగుదామని ఎంత అని అడిగా..
అతను 20 పెద్దది 15 చిన్నది అన్నాడు నేను ఒకటి తాగి వచ్చేశా..!!
.
తరువాత నేను ఎక్కిన బస్సు బైపాస్ లో రిపేర్ వచ్చి ఆగిపోయింది..!!
అందరం బస్సు దిగాము అక్కడ కనిపించిన దృశ్యం ఇది మీరు చూస్తున్న ఫోటో..!!
ఆయన దగ్గిరకు వెళ్లి బొండం ఎంత అని అడిగా..ఆయన Rs.10 అన్నాడు..!!
అందరం తాగాము ,బొండాల మీద పడుకున్న కుర్రోడు ఆనందంగా లెగిచి
ఆకాశం వైపు చూస్తూ దణ్ణం పెట్టాడు..!!
.
బాబు ఎందుకు అలా చేశాడు అని అక్కడ ఉన్న పెద్దాయనన్ను అడిగాను..!!
ఆ బాబు దేవుడా రోజు కి ఒక బస్సు అయన చెడిపోవాలి అందరు వచ్చి
కొనాలి అని దణ్ణం పెట్టుకున్నాడు అని ఆ పెద్దాయన చెప్పి బాధపడ్డాడు..!!
.
అయ్యో ఏందుకు అలా పెట్టాడు అని తాతని అడిగాను..!!
సార్ నాబిడ్డ కోడలు లేరు చనిపోయారు..
మనవడు మనవరాలు నాదగ్గిర ఉంటన్నారు, రెండు రోజులనుండి భోజనం లేదు..!!
.
వాళ్ళకి స్కూల్స్ కి వేసవి సెలవులు ఇవ్వటం వలన వాళ్ళకి భోజనం
రెండు పూటలా పెట్టలేక పోతున్నా అన్నాడు (నేను చాల బాధపడ్డాను)..!!
వాళ్లకు బడిలో భోజనం పెడతే తిని ఇంటి దగ్గర రాత్రికి రొట్టిలు తిని బ్రతుకుతాం అన్నాడు..!!
.
బడికి సెలవలు ఇవ్వటం వలన పిల్లలకు భోజనం లేదు..!!
అందుకే అయ్యా వాడు అలా బస్సు చెడిపోవాలి అన్నాడు ,ఏమి అనుకోకండి అన్నాడు.
అప్పుడు వెంటనే జేబులోనుండి 100 తీసి ఇచ్చాను అబ్బాయీకి..!!
వాడు వద్దండి తీసుకొను కస్టపడి సంపాదించి తింటాను అన్నాడు..!!
కష్టపడకుండా వచ్చింది తీసుకోవద్దని మా అమ్మ చెప్పింది తీసుకోకూడదు అని..!!
నేను ఆచ్చర్యపోయాను .ఆకలితో చావడానికి నిజాయతిగా వున్నారా ఇంకా ఈలోకంలో..!!
.
అప్పుడు వెంటనే నేను దేవుడుకి దణ్ణం పెట్టుకున్నా వాళ్లకు
రోజు బేరం ఉండాలని ఇలాంటి పరిస్తేతి ఎవ్వరాకు రావద్దు అని...!!
.
ఫ్రెండ్స్ మీకు ఇలాంటి చిన్న చితక బీద వ్యాపారులు ఎక్కడైనా
దారిలో కనపడితే కొనండి ,ఇలాంటి వాళ్లకు దానం చేసిన తీసుకోరు ...!!
.
నాకో ఒక విషయంలో బాగా కోపం వచ్చింది..!!
ఎంత టెక్నాలజీ పెరిగినా ఇప్పటి కాలంలో బడిలో పెట్టే భోజనం తిని
బ్రతికేవాళ్ళు ఉన్నారు అంటే అది ఎవరితప్పు నాయకులదా దేవుడిదా అని..??