కుక్కచ్చు లేదా కుక్కడుగు అంటే ఏమిటో మరి ?





కుక్కచ్చు లేదా కుక్కడుగు అంటే ఏమిటో మరి ?
....................................................

కుక్కచ్చు అనే పదం మనకు ఇప్పుడు కొత్తగా వున్నప్పటికి మధ్య యుగభారతంలో అందునా తెలుగుదేశంలో బాగా అమలులో వున్న వ్యవహారం.

మధ్యయుగంలో భారతదేశంలో నేరాలకు శిక్షలు ఏ విధంగా వుండేవో తెలుసుకుందాం. నేరాలు అనేక రకాలు. అందులో ముఖ్యమైనవి రాజద్రోహం దేశ ద్రోహం దోపిడి దొంగతనాలు హత్యలు మానభంగాలు అబద్దాలు చెప్పడం తప్పుడు తూకాలుకొలతలు కల్తీలు లంచగొండితనం యుద్ధంనుండి పారిపోవడం మొదలైనవి.

ఇక శిక్షలు ఎలా వుంటాయో పరిశిలిస్తే  మరణశిక్షలు అనగా తలనరకడం ఊరితీయడం  ఏనుగులతో తొక్కించడం విషనాగులతో కాటువేయించడం మంటల్లో పడవేయడం బ్రతికి వున్నట్లుగానే చర్మం బలిపించడం ఎత్తునుండి లోయలలో పడవేయడం మొదలైనవి.

కాళ్ళుచేతులు నరకడం కళ్ళు పొడవటం నాలుక తరగడం వృషణాలు కత్తిరించడం వక్షోజాలు కోసివేయడం కొప్పులు కత్తిరించాడు చేతివేళ్ళు తీసివేయడం కాల్చివాతలు పెట్టడం శృంఖాలాలు తగిలించి బరువులు ఎత్తి  ఎండలో నిలబెట్టడం తలకిందులుగా వేలాడదీయడం జుట్టుకొరిగి నున్నపుబొట్లు ముఖానపెట్టి గాడిదపై ఊరేగించడం

ఇంకా 
దేశబహిష్కరణ ఆస్తులు జప్తుచేయడం కారాగారంలో వుంచడం  ఐదు లేదా పదిరెట్లు జరిమానా విధించడం కొరడాతో కొట్టడం బలవంతపు వెట్టిచాకిరి మొదలైనవి నాడు అమలులో వున్న శిక్షలు.

శిక్షలు హిందూధర్మంలోని మను, నారద,యజ్ఞ,పరాశర మొదలైన స్మృతుల ప్రకారం విదించేవారు. కంటకశోధన మరియు ధర్మాస్థీయ అనేవి శిక్షలలో రకాలు. ధర్మాస్థీయ అంటే సివిలు కేసులు కంటకశోధన అంటే క్రిమినలు కేసులు.

ముస్లింల పాలనలో షరియా ప్రకారం క్రూరమైనశిక్షలు  అమలులో వుండేవి. ఏనుగులతో తొక్కించడం బ్రతికివున్నట్లుగానే చర్మం ఒలిపించడం చచ్చేంతవరకు శరీరంలోని ఒక్కొ అవయవాన్ని నరకడం మొదలైనవి నాడు  వీరు ప్రవేశపెట్టినవే.

నాడు గ్రామపెద్దలే ధర్మాధికారులుగా వ్యవహరించి పంచాయతీలు పెట్టి శిక్షలు విధించేవారు.  పునర్విమర్శ (appeal) కు అనగా ధర్మాధికారికి నివేదించే అవకాశముండేది. 

గ్రామపెద్దల పంచాయితీతో పాటుగా కులపెద్దలు కూడా కులంలో జరిగిన వ్యవహారాలకు తప్పు కట్టి దండన విధించేవారు. నాడు కులశిక్షలలో దివ్యపరీక్షల పద్దతి అత్యంత సాధారణమైనది.

ఇక కుక్కచ్చు విషయానికి వద్దాం. కుక్కచ్చు అనేది బ్రాహ్మణులకు విధించే గొప్పఘోరమైన శిక్ష. ఆనాడు సమాజంలో బ్రాహ్మణులకు శిక్షలు మరి కఠినంగా వుండేవి కావు. ఎంత ఘోరమైన నేరం చేసినప్పటికి మరణదండన ఉండేది కాదు. హత్యలు మానభంగం దేశద్రోహం రాజద్రోహం వంటి నేరాలకు దేశ బహిష్కరణ లేదా కండ్లు పెరికించడం లేదా కారాగారవాసంలో వుంచడం చేసేవారు. బ్రాహ్మణజాతిలో నేరాల సంఖ్య బహుస్వల్పంగానే వుండేది.
బ్రాహ్మణులను శిక్షల ద్వారా అవమానించడమనేది  వారికి గొప్ప తలవంపు. ఇది అత్మహత్యా సదృశ్యంగా వుండేది.

ఈ విషయాన్ని  కేతన తన విజ్ఞానేశ్వరీయంలో ఎలా చెప్పాడో చూద్దాం.

తల గొరిగించి *కుక్కడుగు* తప్పక ఫాలభాగమందు వ్రాసి ముం
గల ధనమెల్ల బుచ్చుకొని గాడిద నెక్కగ జేసి గ్రామమున్‌
వెలువడ ద్రోచి పుచ్చుటయు విప్రుని జంపుట క్షుద్ర జంతులన్ 
జొలువన చంపు తప్పు గలచో దగు చంపుట ధర్మమెమ్మెయిన్.

కుక్కచ్చు అంటే కుక్కపాదంలా వున్న అచ్చును నుదుటన ముద్ర వేయడం. ఒకానొక విప్రుడు నేరం చేశాడు. అతనికి మరణ సమానమైన శిక్ష విధించాలి. అందుకై  కుక్కపాదం వున్న ఇనుప శలాకను బాగాకాల్చి  ఫాలభాగంలో అచ్చువేశారు. అతని దగ్గరున్న ధనాన్ని దండన  కింద తీసేసుకున్నారు. తలకొరిగించారు. గాడిదపై ఎక్కించి వూరంతా తిప్పి వదిలేశారు.ఇలాంటి వారికి మరణశిక్ష విధించడమంటే క్షుద్ర జంతువును చంపడంలాంటిదని తెలియచేశాడు.

జంతువులలో క్షుద్రజంతువులుంటాయా  ?
ఇక్కడ క్షుద్రజంతువంటి హీనజంతువులని అర్థం. అవి కుక్క గాడిద నక్క సూకరం మొదలైనవి.




Key Words : Telugu WhatsApp

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది