బంగారు భవిష్యత్తు కోసం మొబైల్ భూతానికి దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు


స్మార్ట్ ఫోన్ వ్యసనంగా మారిన పిల్లలకు తిండిపై ధ్యాస ఉండదు. చదువుపై ఆసక్తి ఉండదు. ఏకాగ్రత దెబ్బతింటుంది. గంటల సేపు గేమ్స్ , ఛాటింగ్ లోనే మునిగిపోతుంటారు. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే వీడియో గేమ్స్ తప్ప బయటి ఆట, పాటల గురించి ఆలోచనే ఉండడం లేదు. దీంతో చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పిల్లల కళ్లు దెబ్బతిని కళ్లజోడు వస్తోంది. మెడ, బ్యాక్ బోన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ వాడే పిల్లలు విపరీతంగా ప్రవర్తిస్తారు. తల్లిదండ్రుల, బంధువుల ప్రేమానురాగాలను పట్టించుకోరు. ఇంట్లో జరుగుతున్న విషయాలు గురించి ఆలోచనే ఉండదు. ఈ ధోరణి సరికాదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ తో పిల్లలకు కలిగే నష్టాలను పెద్దలు గుర్తించాలని డాక్టర్లు, మానసిక నిపుణులు సూచిస్తున్నారు. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం మొబైల్ భూతానికి దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది