ముగ్గురు స్నేహితులు వేసవి సెలవుల్లో విహారయాత్ర కు పడవలో బయలుదేరారు. చాలా దూరం వెళ్లిన తర్వాత పడవ చెడిపోయింది. ముగ్గురూ ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు. అది ఒక నరమాంసభక్షకులు ఉండే దీవి. వీళ్ళు ముగ్గురూ వచ్చిన దారి మర్చిపోయి దీవిలో తిరుగుతుండగా నరమాంసభక్షకులకు దొరికిపోయారు. ఈ ముగ్గురినీ వాళ్లు తమ నాయకుడి దగ్గరకు తీసుకెళ్లారు. ముగ్గురినీ మధ్యాహ్నం విందుగా ఏర్పాటు చేయాలని వాళ్ళ నాయకుడు ఆదేశించాడు. దీంతో భయపడి పోయిన ముగ్గురూ తమను వదిలేయాలని ప్రాధేయపడ్డారు. అందుకు వాళ్ల నాయకుడు అంగీకరించలేదు. ముగ్గురూ చాలాసేపు బ్రతిమాలిన తర్వాత ఒక షరతు మీద అంగీకరించాడు. అదేంటంటే ముగ్గురూ అడవిలోకి వెళ్లి ఒక్కొక్కరు ఒక్కో రకం పండు ఇరవై చొప్పున తీసుకుని రమ్మన్నాడు. గంట తర్వాత ముగ్గురూ వాళ్లు ముగ్గురూ తలా ఇరవై పండ్లు తీసుకుని తిరిగి వచ్చారు. నాయకుడు ముగ్గుర్నీ వరుసగా నిల్చోమని చెప్పి, వాళ్లు తెచ్చిన పండ్లను ఆపకుండా గబగబా తింటే వదిలేస్తానని, మధ్యలో ఆపినా , ఇరవై పండ్లూ తినలేకపోయినా వాడిని చంపితినేస్తానన్నాడు.
మొదటివాడు ఆపిల్ పండ్లు తెచ్చాడు. తినడం మొదలు పెట్టాడు ఒకటి , రెండు , మూడు....... పది.....పద్నాలుగు... ఇంక తినలేక తనవల్ల కాదన్నాడు. అంతే నరమాంసభక్షకులు అందరూ కలిసి మొదటివాడ్ని తినేశారు.
తర్వాత రెండవ వాడి వంతు వచ్చింది. రెండవవాడు చెర్రీ పండ్లు తెచ్చాడు. తినడం మొదలు పెట్టాడు. ఒకటి, రెండు, మూడు..... పది.... పదహైదు..... పంతొమ్మిది వరకు తిన్నాడు. ఇరవైయ్యో చెర్రీ పండును చేతిలోకి తీసుకుని నవ్వడం మొదలు పెట్టాడు. తినడం ఆపినందుకు నరమాంసభక్షకులు రెండవ వాడిని కూడా చంపి తిన్నారు.
ఇప్పుడు మొదటి వాడి ఆత్మ, రెండవవాడి ఆత్మ పై లోకంలో కలుసుకున్నాయి. మొదటివాడి ఆత్మ రెండవవాడి ఆత్మ తో ఇలా అంటుంది "ఒరేయ్ నేనంటే ఆపిల్ పండ్లు తినలేక చచ్చిపోయాను. నీకేమయిందిరా చెర్రీపండ్లు అది కూడా పంతొమ్మిది తిన్నావు ఇంకొక్కటి తింటే బ్రతికే వాడివిగా , ఈలోపల ఏం గుర్తొచ్చిందని అంతగా పగలబడి నవ్వావు" అని అడిగాడు.....
దానికి రెండవవాడు మళ్లీ పగలబడి నవ్వుతూ "ఒరేయ్ నా వెనకున్న మూడవవాడు పనసకాయలు తెచ్చాడ్రా " అన్నాడు.
😆😆😆😆😆😆😆
😅😅😅😅😅😅😅
😂😂😂😂😂😂😂
🤣🤣🤣🤣🤣🤣🤣