తిరుమలకు నడిచి వెళ్ళిన గోమాత
🇮🇳
తిరుమల శ్రీవారి మహత్యం అంతాఇంతా కాదు. ఎందెందు వెతికినా అందందు కలడు అని శ్రీవారిపై రాసిన పాటలు ఎప్పటికీ చిరస్మరణీయమే. అలాంటి స్వామివారి లీలలు ఒక్కొక్కటిగా కనిపిస్తుంటాయి. సాధారణంగా తిరుమలకు కాలినడకన వెళ్ళాలంటే కొద్దిగా ఇబ్బందులు తప్పవు. కాళ్ళ నొప్పులనేవి సహజంగా వస్తుంటాయి. మానవులకే ఇన్ని ఇబ్బందులైతే ఇక జంతువుల విషయం చెప్పాలా. అలాంటిది జంతువులు మెట్లు ఎక్కి తిరుమలకు వెళితే…? జంతువులు వెళ్ళడం ఏంటి అనుకుంటున్నారా… తిరుపతి సమీపంలోని శ్రీవారి మెట్టు మార్గం నుంచి ఒక గోవు 2300 మెట్లను సునాయాసంగా ఎక్కి తిరుమలకు చేరుకుంది. కాలినడక మార్గంలోనే భక్తులతో కలిసి గోవు ఎక్కింది. గోవును చూసిన భక్తులు ఆశ్చర్యపోయి ఆ గోవుకు కుంకుమ బొట్లు పెట్టారు. కొంతమంది గోమాతకు నమస్కరించారు. మరికొంతమంది అరటిపండ్లు, కొన్ని పండ్లను ప్రసాదంగా ఇచ్చారు. ఒక గోవు మెట్లు ఎక్కి తిరుమలకు వెళ్ళడం ఏమిటో ఇప్పటికీ ఎవరికీ అర్థం కాలేదు. తిరుమలకు వెళ్ళిన గోవును టిటిడి అధికారులు గుర్తించి ఆ గోవును తిరుమలలోని గోశాలకు తరలించారు. గోవుకు సరిపడా మేతను అందిస్తున్నారు. గోశాలలోని గోవును చూసేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.
- Home
- Web Templates
- _WordPress Themes
- _Blogger Templates
- _Customs Templates
- _Adobe XD Web
- Graphic Design
- _Fonts
- __Popular fonts
- __Recent Fonts
- Mockups Templates
- _Technology
- _PSD file
- _T-Shirts
- _Prints and Packaging
- _Social Media
- Others
- _Plugins
- _Vector Illustration
- _Software
- _UX and UI Design
- _Programming
- _Popular Tools
- _Review Project
- _Popular Tools
- Blog
- About