#వారానికి 7 రోజులు ఎందుకు??
#రోజుకు 24 hours కదా hour అనే పదం ఎక్కడిది??
#ఆదివారం తర్వాత సోమవారం_ఎందుకు?
మంగళ వారం రావొచ్చుగా??
మనలో కూడా చాలా మందికి
తెలియని విషయాలు తెలుసుకుందాం..
#ప్రపంచంలోఏదేశానికి లేని జ్ఞాన సంపద మన సొత్తు..
ఎన్నో వేల లక్షల సంవత్సరాల నుండి...
మిగతా దేశాలు వారు గ్రహాలు అంటే
ఏంటో తెలియక ముందే నవ గ్రహలను
గుర్తించిన ఘనత మనదే..
ఎప్పుడు సూర్యోదయం అవుతుంది?
ఎప్పుడు సూర్యాస్తమయం అవుతుంది?
#ఎప్పుడు_చంద్రగ్రహణం?
#ఎప్పుడు_సూర్యగ్రహణం?
ఏ కార్తె లో ఏ పంట పండించాలి ఇవన్నీ కూడా
మన భారతీయులు చేతి వేళ్ళు లెక్కలతో వేసి చెప్పినవే..
ఎటువంటి పరికరాలు టెలిస్కోపులు లేకుండా సాధించినవే..
పైన ప్రశ్నకి జవాబు:-
మన వాడుకలో ప్రతి రోజుకి ఒక పేరు ఉంది.
ఆదివారము, సోమవారము, మంగళ వారము,
బుదవారము, గురువారము,
శుక్రవారము, శని వారము. ఇవి ఏడు.
ఇలా ఈ ఏడు రోజులకు ఏడు పేర్లు ఎందుకు పెట్టారు
ఆ పేర్ల నిర్ణయానికి ఒక శాస్త్రీయమైన పద్ధతి వుంది.
నిర్ధిష్టమైన పద్ధతిలో పూర్వ కాలంలో
భారత మహర్షులు ఆ పేర్లను నిర్ణయించారు
ఆ పేర్ల నిర్ణయానికి శాస్త్రీయమైన కారణాలున్నందునే
ఆ పేర్లే ప్రపంచ వ్యాప్తంగా ఆచరణలో నేటికి ఉన్నాయి.
భారత కాలమానంలో #హోరా అనగా ఒక గంట అని అర్థం.
దీని నుండి పుట్టినదే ఇంగ్లీషు #HOUR .
ఒక రోజుకు 24 గంటలుంటాయి,
అంటే 24 హోరాలు. ఒక రోజులో ఉన్న
24 గంటలు (24 హోరాలు) కూడా
ఏడు హోరాల చక్రం లో తిరుగుతాయి
ఆ హోరాలకి ఏడు పేర్లున్నాయి.
అవి వరుసగా.. (ఈ వరుసలోనే) శని, గురుడు,
కుజుడు, రవి, శుక్ర, బుద,
చంద్ర హోరాలు ప్రతి రోజు వుంటాయి.
ఈ 7 హోరాలే ప్రతి రోజు 24 గంటల్లో ఉంటాయి..
7 గంటల కొకసారి ఈ 7 హోరాలు పూర్తీ అయ్యాక
మల్లి మొదటి హోరాకి వస్తుంది.. అంటే
శని హోరా నుండి చంద్ర హోరాకి మల్లి శని హోరాకి..
ఉదాహరణకు ఆది వారము రవి హోరాతో
ప్రారంభం అయి మూడు సార్లు పూర్తికాగా
(3 సార్లు 7 హోరాలు 3x7 = 21 హోరాలు)
22వ హోరాపేరు మళ్ళీ రవి హోరా వస్తుంది.
23 వ హోరా పేరు ఆ వరుసలో శుక్ర హోరా అవుతుంది.
24 వ హోరా బుధ హోర అవుతుంది.
దాంతో ఒక రోజు పూర్తవుతుంది.
ఆ తర్వాత హోరా 25వ హోరా.. అనగా
తరువాతి రోజు మొదటి హోరా దాని పేరు చంద్ర హోరా.
అనగా సోమవారము.. అనగా
చంద్ర హోరాతొ ప్రారంభ మౌతుంది.
ఏరోజు ఏ హోరాతో ప్రారంభ మవుతుందో
ఆ రోజుకు ఆ హోరా పేరున దానికి ఆ పేరు వుంటుంది.
చంద్ర హోరాతో ప్రారంభమైనది గాన అది సోమవారము.
ఈ విధంగానే మిగిలిన దినములు కూడా
ఆయా హోరాల పేరన పేర్లు ఏర్పడతాయి
రవి(సూర్యుడు) హోరాతో ప్రారంభం = రవివారం,
ఆదిత్య అన్న కూడా సూర్యుడు పేరే..సో ఆదివారం,
భానుడు అన్న కూడా సూర్యుడే భానువారం
(కర్ణాటక, తమిళనాడు లో భానువారం వాడుతారు)
ఇలా ఆయా హోరాలు బట్టి రోజుల పేర్లు వచ్చాయి...
ఆదివారం తరవాత సోమవారం ఎందుకు రావాలి?
మంగళ వారమ్ రాకూడదా??
రాదు.. ఎదుకంటే
ఆదివారం రవి హోరా ప్రారంభం అయ్యింది,
తరువాత రోజు అంటే సోమవారం
చంద్ర హోరాతో ప్రారంభం అయ్యింది కాబట్టి..
ఇది మన భారతీయుల గొప్పతనం..
ఈ విషయాలు తెలియక మనల్ని మనం
చిన్న చూపు చూసుకుంటాం..
ప్రపంచంలో దేశమయినా
మన పద్దతి ఫాలో అవ్వాల్సిందే
కానీ మనకి మాత్రం మనం అన్నా
మన దేశమన్నా లోకువ...
ఇంత నిర్థిష్టమైన పద్ధతిలో వారమునకు
పేర్లు పెట్టారు గనుకనే భారత దేశ సంప్రదాయాన్ని
ప్రపంచమంతా అనుసరిస్తున్నది..
- Home
- Web Templates
- _WordPress Themes
- _Blogger Templates
- _Customs Templates
- _Adobe XD Web
- Graphic Design
- _Fonts
- __Popular fonts
- __Recent Fonts
- Mockups Templates
- _Technology
- _PSD file
- _T-Shirts
- _Prints and Packaging
- _Social Media
- Others
- _Plugins
- _Vector Illustration
- _Software
- _UX and UI Design
- _Programming
- _Popular Tools
- _Review Project
- _Popular Tools
- Blog
- About