నాయకుడెక్కడినుండి పుడతాడు.?
సమస్యలోంచి
పోరాటంలోంచి
అవసరంలోంచి
త్యాగాలలోంచి
శ్రామికజెన సంద్రంలోంచి
పేదల కష్టాలు కన్నీల్లలోంచి
పదునెక్కిన మేథస్సు తెగింపులోంచి
విశ్వవిద్యాలయ కర్మాగారాలోంచి
అడవిలోంచి పల్లెలోంచి
ప్రశ్నించె తత్త్వం లోంచి
పరిణతి చెందిన ఆలోచనల్లోంచి
ప్రసంగం విని
పాటలు వినో
సాహిత్యం చదివో
సంఘటన జరిగో
అన్యాయం జరిగో
ఆలోచన పెరిగో.....
ప్రజల ప్రభావితం చేసె ప్రతిభతలోంచి పుట్టుకు రావాలి నాయకత్వం
అదేందో ఈ దేశంల
నాయకులకు నాయకులు పుడుతున్నారు.
కులాలకు పుడుతున్నారు.
డబ్బులోంచి పుట్టుకొస్తున్నారు
చెంచా గిరిలోంచి జోకడంలోంచి
బానిసత్వం అలవరుచుకుని దానిలోంచి
డబ్బు ఖర్చుపెట్టి
ప్రజలను మభ్యపెట్టి
మాట్లాడటం రాకున్నా
నీతి నిజాయితి లేకున్నా
పనికిమాలిన పనులు చేస్తున్నా
నాయకులుఅవుతున్నరు.
నాయకత్వానికి అర్హతేంటి ?
నాయకత్వానికి పదవి గీటురాయా?
కులం డబ్బు వారసత్వం లేకుండా పుట్టుకు రాకూడదా?
రాజకీయాలలోకి వస్తేనే నాయకుడా?
పార్టీలో పని చేస్తేనే నాయకుడా?
ఎంత చెండాల సమాజంలో బతుకుతున్నామో...
కళ్ళ ముందు ఏది జరిగిన గతంకన్నా తక్కువే నష్టం జరిగిందని మూసుకోవాలా..
ప్రశ్నిస్తే
ఉన్న రేషన్ కార్డ్ ఊడిపోతాదని భయపడాలా
అయ్య పెన్షన్ ఆగుద్దనో
ఉన్న పదవి ఊడుద్దనో
రేపేదన్న అవసరమైతె ఎట్లని ఎనక్కి తగ్గాలా.
ఎప్పుడో విసిరే ముక్క బొక్క కోసం ఇప్పటి నుండే చస్తు బతకాలా?
ఐదేల్ల కోసం యాబై ఏల్ల వ్యక్తిత్త్వం తాకట్టుపెట్టాలా...
తూ.. అదో బతుకా ?
స్వయం శక్తితో బతకలేనివాడు
నాయకుడెలా అవుతాడు
పరిమిత లక్ష్యం కలవాడు మనిషెలా అవుతాడు
నాయకుడంటే ఒకడి కింద బతికే బానిసా ??
ప్రజసొమ్ముకోసం ఆశపడే గోతికాడి నక్కా ??
తాగేవాడు తాగించెవాడు చెడుచేసినా అండగుండేవాడు నాయకుడెలా అవుతారు
నేటి సమాజానికి చాలా మంది నాయకులు కావాలి?
మీరేమంటారు..