📜🖋🌸🌸➖➖➖➖➖➖
*ప్రసిద్ధ కవి..జంధ్యాల పాపయ్య శాస్త్రి (కరుణశ్రీ)గారి వర్దంతి నేడు..*✍🏻
➖➖➖➖➖➖➖🌸🌸🍃
★ జంధ్యాల పాపయ్య శాస్త్రి పేరు సాహితీ జగత్తుకు చిరపరిచితమే. గొప్ప కవిగా పేరు పొందాడు. మృదు భాషిగా, సుమధుర కవిత్వానికి చిరునామాగా చెప్పబడ్డారు. ఇతని కలం పేరు కరుణశ్రీ. నవరసాలలో కరుణ రసానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు.
*★ శ్రీ జంధ్యాల పాపయ్య రాసిన ఉదయశ్రీ, కరుణశ్రీ, విజయశ్రీ, కుంతికుమారి పుష్ప విలాపం కావ్యాలు ఆయనకు గొప్ప కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి.*
*★ తెలుగులో పద్యం, వచనం, గేయం వంటి ప్రక్రియా రూపాల్లో 76కు పైగా రచనలు చేశారు. అలా వచనం గేయం ప్రక్రియలు చేపట్టినా అత్యంత ప్రాధాన్యం పద్యానికే ఇచ్చారు.*
★జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పద్యానికి అంతపేరు రావడానికి ఆ పద్యాల సొగసు, హొయలు అన్నీ కవిగారి నోట పలికేటప్పుడు ఎంతో తీయగా, రమ్యంగా సరళంగా మధురంగా పండితులకే కాదు పామర జనులకు కూడ సులువుగా ఆకర్షించే రీతిలో ఆలపించడమే కారణం.
*🌷పుష్పవిలాపంలో...*
*"నేనొక పూలకడనిల్చి*
*చివాలున కొమ్మవంచి*
*గొరానెడు నంతలోన విరులన్నియు*
*జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణము*
*తీతువా యనుచు బావురుమన్నవి"*
....అనే కరుణశ్రీ పద్యం కరుణ రసభరితం. సున్నితమనస్కుల హృదయాలను చెమరింపచేస్తుంది.
*◆ కుంతి కుమారి, పుష్పవిలాపం రెండు కావ్యాలలో కరుణ రసం తొణికిసలాడడం మనం గమనిస్తాం. ఈ కావ్యాల్లోని పద్యాలను ఘంటసాల వేంకటేశ్వరరావు ఆలపిస్తుండే సాహిత్యాభిమానుల మేనులు పులకింతలకు లోనుగాగ మైమరచిపోయే వారు. తన్మయత్వం పొందని ఆంధ్రుడు లేడని గర్వంగా చెప్పవచ్చు.నిజానికి కరుణశ్రీ పద్యాలను ఘంటసాల పాడడం వల్లే అంతపేరు వచ్చిందని ఆనాటి రోజులలో కొందరంటే కరుణశ్రీ పద్యాలను ఘంటసాల పాడడంవల్లే అతనికి అంతపేరు వచ్చిందని మరికొందరు అనేవారు.*
*◆ ఏదేమైనా కరుణశ్రీ పద్యాలను ఘంటసాల పాడడం వల్ల కరుణశ్రీకి, పాడిన ఘంటసాలకు విశేషమైన కీర్తి ప్రతిష్టను దక్కడంవల్ల వీరి అవినాభావ సంబంధానికి పూవుకు తావిఅబ్బినట్లు చెప్పవచ్చు. ఘంటసాల స్వయంగా చెప్పుకొన్నాడు తాను చలనచిత్ర రంగంలో స్థిరపడడానికి పుష్పవిలాపంలోని పద్యాలు పాడడమే కారణమని.*
■ జంధ్యాల పాపయ్య శాస్త్రి గుంటూరు జిల్లాలోని పెదనందిపాడు మండలం కొప్పర్రు గ్రామంలో 1912 ఆగస్టు 4న జన్మించారు. తల్లిదండ్రులు శ్రీ పరదేశయ్య మహాలక్ష్మిలు.
గుంటూరులోని స్టాలు గర్ల్స్ హైస్కూలులో అమరావతి రామకృష్ణ విద్యాలయంలో, ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో 22 సంవత్సరాలు హిందూ కళాశాలలో 2 సంవత్సరాలు ఆంధ్రోపన్యాసకులుగా వ్యవహరించారు. విద్యార్థినీ విద్యార్థులకు విశేషమైన సేవలు అందించారు.
*■ జంధ్యాల పాపయ్య శాస్త్రి రాసిన ఉదయశ్రీ కావ్యం 50 సార్లు పునర్ముద్రిత మైంది. ఇది సామాన్య విషయం కాదు గదా! కరుణశ్రీ మరో రచన ఉమర్ ఖయ్యాం. ఈకావ్యం తెలుగు విశ్వ విద్యాలయం అవార్డు పొందింది. కరుణశ్రీ రచనలు మరెన్నో ఇతర భాషలైన హిందీ, ఇంగ్లీషు లలోకిఅనువదించబడ్డాయి.*
■ తిరుమల తిరుపతి దేవస్థానం వారు పోతన భాగవతాన్ని సరళమైన తెలుగులో అందించేందుకు పూనుకొని పోతన ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. దానికి ప్రధాన సంపాదకులుగా కరుణశ్రీని నియమించడం మరో అరుదైన విశేషంగా చెప్పవచ్చు.
*■ కరుణశ్రీ పొందిన బిరుదులు, సన్మానాలు అనేకం తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంవారు కరుణశ్రీని గౌరవ డాక్టరేట్‌తో సత్కరించారు.*
*★ కరుణశ్రీ ఇంటిలో నిత్యం ప్రముఖ కవి పండితులతో సాహిత్యంపై చర్చలు జరిపేవారు. ఇంతటి సాహితీవేత్త సాహితీ ప్రియులను దు:ఖసాగరంలో ముంచి 1992 జూన్ 22న శాశ్వతంగా కన్నుమూశారు. సాహితీ లోకంలో కరుణశ్రీ లేనిలోటు ఎప్పటికీ ఎవ్వరూ తీర్చలేనిది.*
(జ:ఆగస్టు4,1912-మ:జూన్22,1992)