దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుగ్రహీత, "ఎల్.వి.ప్రసాద్" గారి వర్దంతి

📽🖼➖➖➖➖➖➖➖➖
*దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుగ్రహీత, "ఎల్.వి.ప్రసాద్" గారి వర్దంతి నేడు..*June 22
➖➖➖➖➖➖➖🌸🌸🍃
★ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత
ఎల్.వి.ప్రసాద్ గా ప్రసిద్ధి చెందిన అక్కినేని లక్ష్మీవరప్రసాదరావు తెలుగు సినీనిర్మాత, దర్శకుడు, నటుడు మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత.

*■ ఈయన జనవరి 17, 1908లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఏలూరు తాలూకాలోని సోమవరప్పాడు గ్రామమునందు అక్కినేని శ్రీరాములు, బసవమ్మ దంపతుల రెండవ సంతానముగా జన్మించాడు. హిందీ, తమిళ, తెలుగు, కన్నడ వంటి పలు భారతీయ భాషలలో 50 చిత్రాల వరకు ఆయన దర్శకత్వం వహించటంగానీ, నిర్మించటం గానీ, నటించటంగానీ చేశాడు.*

*★ అంతేకాదు ఎల్.వి.ప్రసాద్ హిందీ, తమిళ, తెలుగు భాషలలో తొలి టాకీ చిత్రాలయిన ఆలంఆరా, కాళిదాసు మరియూ భక్తప్రహ్లాద మూడింటిలోనూ ఆయన నటించాడు. తెలుగువారిలో బహుశా ఆయన ఒక్కరే ఈ ఘనత సాధించి ఉంటాడు.*

*🍄బాల్యం..*
■ రైతు కుటుంబంలో పుట్టిన ప్రసాద్ గారాబంగా పెరిగాడు. చురుకైన కుర్రవాడే కానీ చదువులో ఎప్పుడూ శ్రద్ధ చూపలేదు. ఉరూరా తిరిగే నాటకాల కంపెనీలు, డాన్సు ట్రూపుల డప్పుల చప్పుల్లు ప్రసాద్ ను ఆకర్షించేవి. స్థానిక నాటకాల్లో తరచుగా చిన్న చిన్న వేషాలు వేసేవాడు. ఇదే ఆసక్తి పెద్దయ్యాక కదిలే బొమ్మలు, నటనపై ఆసక్తిని పెంచి సినిమా రంగంలో ప్రవేశించడానికి పునాదులు వేసింది.

*■ ప్రసాద్ తండ్రి కొండలా పెరిగిపోతున్న అప్పులను భరించలేక, ఇళ్ళు గడవక చేతులెత్తేసి కుటుంబాన్ని తలదించుకు నేట్టు చేశాడు. ఇదే సమయంలో ప్రసాద్ తన నటనా ప్రతిభను జీవనోపాధికై ఉపయోగిం చాలని నిశ్చయించుకుని జేబులో వంద రూపాయలతో ఎవరికీ చెప్పకుండా ఊరు విడిచి వెళ్ళాడు.*

*🍄సినిమా రంగము..*
■ ప్రసాద్ బొంబాయి (ముంబై) చేరి వీనస్ ఫిల్మ్ కంపెనీలో చిన్నచిన్న పనులు చేసే సహాయకుడుగా పనిచేశారు. అచట ఇండియా పిక్చర్స్ అక్తర్ నవాజ్ తను నిర్మిస్తున్ననిశ్శబ్ద చిత్రం "స్టార్ ఆఫ్ ది ఈస్ట్"లో చిన్న పాత్ర ఇచ్చాడు.

*★1931 లో, అతను వీనస్ ఫిలిం కంపనీ లో నియమితుడై భారతదేశం యొక్క మొదటి "టాకీ", ఆలం అరాలో నటించా డు. తరువాత ఇతర చిన్న పాత్రలు అనుసరించాయి.*

*★ఇంపీరియల్ ఫిలింస్ సినిమాల ద్వారా ప్రసాద్ H M రెడ్డిని కలుసుకోవడం జరిగింది. రెడ్డి తను నిర్మిస్తున్న మొదటి తమిళ "టాకీ" కాళిదాస్ లో ఒక చిన్న పాత్ర ఇచ్చారు.*

*★ తర్వాత తొలి తెలుగు "టాకీ" భక్త ప్రహ్లాదుడులో అవకాశమిచ్చాడు.*

■ అనుకోని ఒక అవకాశం ద్వారా ప్రసాద్ కు ఆలీ షా దర్శకత్వం వహిస్తున్న"కమర్-ఆల్-జమాన్" చిత్రం లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని దొరికింది. తన పేరు ఉపయోగించ డానికి చాలా పొడవుగా ఉందన్న ఒక గుమస్తా కారణముగా అక్కినేని లక్ష్మీ వరప్రసాద్ రావు పేరు ఎల్వి ప్రసాద్ గా కుదించబడింది.

■ 1943 లో అతను గృహ ప్రవేశం కోసం అసిస్టెంట్ డైరెక్టర్ బాధ్యతను నిర్వహించే అవకాశం వచ్చింది. పరిస్థితుల కారణంగా ఆ సినిమాకు దర్శకుడు అయ్యాడు మరియు అతను చిత్రం యొక్క ప్రధాన నటుడిగా ఎంపికయ్యాడు. 1946 లో విడుదలైన గృహ ప్రవేశం నలభైలలో అత్యుత్తమ చిత్రాలలో ఒకటి.

*★ 1949 లో 'మన దేశం"అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తూ ,  NT రామరావు మరియు SV రంగారావు లను తెలుగు చిత్రసీమకు పరిచయం చేశాడు.*

★1950 లో విజయ పిక్చర్స్ దర్శకుడిగా ఎల్వి ప్రసాద్ స్థాపించటం వారి మొదటి చిత్రం 'షావుకారు' విడుదల చేసింది. ఇది విడుదలైన ఎక్కడ రికార్డులు సృష్టించినది.

*🍄నటునిగా..*
స్టార్ ఆఫ్ ది ఈస్ట్ (Star of the east (Silent)) - అసంపూర్తి.
1931 : ఆలం ఆరా - మొదటి హిందీ టాకీ
1931 : కాళిదాస్ - మొదటి తమిళ టాకీ
1931 : భక్తప్రహ్లాద - మొదటి తెలుగు టాకీ
1933 : సీతా స్వయంవర్
1940 : బోండాం పెళ్ళి తెలుగు)
1940 : చదువుకున్న భార్య
1982 : రాజా పార్వాయి (తమిళం)

*🍄దర్శకునిగా...*
గృహ ప్రవేశం (1947),పల్నాటి యుద్ధం (1947), ద్రోహి (1948), మన దేశం (1949)
,సంసారం (1950), షావుకారు (1950),
మిస్సమ్మ (1955)..

*🍄పురస్కారాలు..*
●దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
●ఎల్వీ ప్రసాదు స్మారకార్థం భారత తపాలా శాఖ 2006 సెప్టెంబరు 5న ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేసింది.

(జనవరి 17, 1908 - జూన్ 22, 1994)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది