సర్వేంద్రియాణాం నయనం ప్రధానం

👉🙏🏾 పాదార్పణమస్తు  🙏🏾 👈   మన బాడీ లో ఏ అవయవానికుండే ఇంపార్టెన్స్ దానికుంది. దేని పని దానిది. " సర్వేంద్రియాణాం నయనం ప్రధానం " అనటంలో సందేహం లేదు.కళ్ళు లేకపోతే బతుకు నరకమే. అలాగే ఏ అవయవం ప్రత్యేకత దానికున్న, ఎందుకో మన శరీరంలో ' పాదం ' చాలా గొప్పగా వుంటుందనిపిస్తుంది.  నిజం చెప్పొద్దూ మనకు అవతలి వాడిపై బాగా కోపం వస్తే ' నా కాలిగోటితో సమానం చేయవు ' దానర్ధం కాలి గోరు కన్నా అవతలి వారు తక్కువ అనా?? మరి మన పురాణాలల్లో పాదం గూర్చి చాలా గొప్పగా చెప్పారు కదా!రామాయణంలో అహల్య జీవితానికి రామపాద స్పర్శతోనే సార్ధకత ఏర్పడినది. మరియు సత్యభామ అలిగి కృష్ణుడ్ని పాదంతో తన్నినా, తన సంగతి మర్చిపోయి సత్యపాదాలు నొచ్చుకున్నాయా అని ఆలోచించాడు. అంటే కాదండోయ్ విష్ణుమూర్తి దుర్వాసుడి అరికాల్లో ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కి గర్వాన్ని తీసేసాడు. మరలా వామన అవతారం మెత్తి ఒక పాదం ఆకాశంలో, ఒక కాలు భూమ్మీద ఆక్యుపై చేసి మూడో పాదం బలి చక్రవర్తి తలపై మోపి తన అవతార పరమార్ధం పాదంతో పరిసమాప్తి చేసాడు కదా!! ఇంకా పురాణాల్లో చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయండోయ్. అంతెందుకు మన అన్నమయ్యగారు ' బ్రహ్మ కడిగిన పాదము ఈ పాదము అని, కీర్తనలోను, మర్చిపోయాను ఈ మధ్య కొన్నాళ్ళు క్రిందట "" నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా'"' అని పాదానికి పారాణి దిద్దారు కదా!  నిజమే కదండీ పాదానికి యెంత విలువిచ్చారు. ఏమాటకామాట చెప్పుద్దు భారీ శరీరమైన, బక్క శరీరమైన మన బరువు మొత్తాన్ని మోసే వెయిట్ లిఫ్టర్ మన పాదము తప్పా ఎవరున్నారండి? పొరపాటున మన చెయ్యి పక్కవాళ్ళకి తగిలితే అంతగా రియాక్ట్ అవ్వం. కానీ, పాదం తగిలితే వెంటనే ' సారీ' చెప్పేస్తాం. ఏమిటి ఈ ద్వంద్వ వైఖరి.  అంతెందుకు మన తల్లిదండ్రులకో, లేక మనకు తెలిసిన పెద్దలు కనబడితే వెంటనే వారి పాదాలు పట్టుకోని నమస్కారం చేస్తాం. అంతేకాని వారి తలకాయ పట్టుకునో, కడుపు పట్టుకునో నమస్కారం చేయంకదా.  మరలా ఇక్కడ పాదానికి ఇంపార్టెన్స్ఇచ్చారు.               ఇంకా చాలా విషయాలు మన పాదం గురించి ఉన్నాయండోయ్. అది ఎన్నెన్ని రూపాలు మార్చుకుంటుందో ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా?? ఓ క్లాసికల్ డ్యాన్సర్ పాదాలు గజ్జెకట్టుకోని రంగస్థలం మీద నర్తిస్తాయి. ఓ జానపద కళాకారుని పాదాలు ' జజ్జనకనజ్ఝనారే' అంటూ చిందులేస్తాయి. ఓ కుమ్మరి పాదాలు కుండాలను, ఓ చేనేత కార్మికుడికి చేతులతో పాటు పాదాలు ఉపయోగిస్తూ అపురూప వస్త్రాలను తయారీ చేయుటలో అవి ఎంతగా ఉపయోగ పడుతున్నాయి. అంతేందుకండి చేతులు లేకపోయినా పాదాలతో పరీక్షలు వ్రాసి పాసైన విద్యార్థుల వార్తలు న్యూస్ పేపర్లల్లోనూ, టి.వి. లల్లోనూ విన్నాము-- చూసాము కదా!   👉👉 ఇంత గొప్ప పాదానికి మరలా  చిన్న చూపు. కొత్తకోడలు కాపురానికి వచ్చిన తర్వాత, ఇంట్లో ఎవడికైనా ఇబ్బంది వస్తే చాలు..."" మహాతల్లి..పాదం పెట్టింది... అన్ని కష్టాలే.. అనే శాపనార్ధాలు. దానికి పాదాన్ని నిందించటం ఎందుకండి? శరీరంలో చాలా అవయవాలు వున్నాయి కదా? మరలా కాల్సిరాకపోతే " ఐరెన్ లెగ్ " అంటూ బిరుదులు. మరలా అవే పాదాలకు వివాహంలో విశేష ప్రాధాన్యంతో " సప్తపదీయం " అంటూ ఏడడుగులు కు విలువ ఇయ్యటమే కాక " సప్తపది" అని సినిమా కుడా తీసాం కదా!  ఇలా చెప్పుకుంటూ పొతే పాదాలరిగిపోతాయి. 👉 ఇది కాక మరలా ఆ పాదాల్లో అంతరాలు. కుడి పాడానికున్న ప్రాధాన్యత ఎడమ పాదానికి ఉండదు. కొత్తకోడలు ఇంట్లోకి వచ్చేప్పుడు "" కుడిపాదం పెట్టిరామ్మా"" అనీ, శతృకూటమి లోకి వెళ్ళేప్పుడు ఎడమ పాదం పెట్టమని ( సుందరాకాండలో హనుమంతుడు లంకలో ఎడమ పాదం మోపాడు),  ఇలా పాదానికి మంచి--చెడు మిశ్రమంతో చాలా పాత్ర పోషిస్తుంది అని సర్వం "" పాదార్పణమస్తు"" అంటూ కాసేపు మీతో మీ జంపని శ్రీనివాసమూర్తి.🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది