ఏమయ్యా లాయరు దొరికాడా?

శ్రీటంగుటూరి ప్రకాశం పంతులుగారు గురించి మీకు తెలిసేవుంటుంది. ఆయన్ని ఆంధ్రకేశరి అనిపిలిచేవారు.
ఆయన లండన్ లో బారిస్టర్ చదివి మనదేశంలో ప్రాక్టీసు పెట్టారు.

ఒకసారి ఒక కోర్టులో దోంగతనం కేసులో ముద్దాయిని విచారించేముందు జడ్జీగారు ముద్దాయిని "నీతరఫున వాదించేందుకు లాయరు ఎవరూలేరా" అని అడిగారు.

"లేరండి" అన్నాడు ముద్దాయి,
"అయితే ప్రక్కనే లాయర్లు విశ్రాంతి తీసుకునే గది వుంది. అక్కడకి వెళ్ళు. పావలా (ఇప్పుడు 25 పైసలు) ఇస్తే లాయరు దొరుకుతారు" అని పంపించారు.

ఆముద్దాయి లాయర్ల విశ్రాంతి గదిలోకి వెళ్ళి "అయ్యా ఇక్కడ పావలా ఇస్తే లాయరు దొరుకుతారని జడ్జీగారు చెప్పారు. ఇప్పుడు నాతరఫున వాదించడానికి ఒకలాయరు కావాలి. ఇదిగో పావలా" అని జేబులోంచి పావలా తీసి బల్లమీద పెట్టాడు.

లాయర్లు అవాక్కయ్యారు.
వెంటనే ప్రకాశం పంతులుగారు వాడిని దగ్గరకు పిలిచి చెవులో ఏదో చెప్పి వాడి పావలా వాడికి తిరిగి ఇచ్చేసి పంపించేసారు
ఆముద్దాయి తిన్నగా కోర్టుగదిలోకి చక్కావచ్చాడు.

జడ్జీగారు వాడిని చూసి "ఏమయ్యా లాయరు దొరికాడా?" అని అడిగారు
"లేదండి. పావలాకి వచ్చే ఆ లాయర్లంతా ఇప్పుడు జడ్జీలైపోయారుట." అన్నాడు వినమ్రంగా.😄🤓😆👏🏻👌🏻

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది