జై గోమాత ..... జైజై విశ్వమాత
గోమయ సబ్బు .......
ఆవు పేడతోటి సబ్బు కూడా తయారు అవుతుంది.
ఆవు ప్రసాదించే ఉత్కృష్టమైన పదార్ధం గోమయం. గోమయంలో లక్ష్మీ దేవి ఉంటుంది. ఆవు పేడలో అద్భతమైన శక్తి ఉంది. ఆవు పేడ అద్భుతమైన విషనాశిని.
ఆవు పేడ చర్మానికి పోషక విలువలను అందిస్తుంది , చర్మవ్యాధులను అంతం చేస్తుంది.
ఆవు పేడతో చేసిన సబ్బును ఉపయోగించడం వలన దురదలు తగ్గిపోతాయి. ఎండా కాలంలో కొందరికి చర్మం పేలుతూ ఉంటుంది. అది కూడా పోతుంది. శరీరంలో వస్తున్న దుర్వాసన కూడా పోతుంది.
ఎక్కువగా చెమటలు పట్టడం , అసలు చేమటలే పట్టనివారు ఈ సబ్బును వాడటం వలన వారికున్న జబ్బు నయమవుతుంది. ఆవు పేడ సబ్బు చర్మానికి ఎంతో మేలు చేస్తుంది.
ప్రస్తుతం అన్ని రకాల సబ్బులలో శరీరానికి హాని కలిగించే కెమికల్స్ వాడుతున్నారు. ఎవరికైనా చర్మవ్యాధులు వచ్చాయనుకోండి , అపుడు డాక్టర్లు సబ్బును వాడకూడదు అంటారు. అపుడు ఈ ఆవు గోమయంతో చేసిన సబ్బులు వాడి మీ చర్మ రోగాలను తొలగించుకొండి.