మమ్మీ గానీ డాడీ గానీ వస్తారు

హృదయ విధారకం....
సాయంత్రం వేళ సరిగ్గా ఒక స్కూల్ గేటు ముందే బైక్ పంచర్ అయింది.
అక్కడే ఒంటరిగా బెంచ్ మీద కూర్చున్న నాలుగేళ్ల బుడ్డోడు నన్ను ఆకర్షించాడు ..... వెళ్లి పక్కన కూర్చుని " ఏమ్మా ఇంకా అమ్మ రాలేదా తీసుకెళ్ళడానికి "? అని అడిగాను ...

" అమ్మలేదు " అన్నాడు అదోలా... నాకు మనసు చివుక్కుమంది.. 😟

" ఓహ్ నాన్న వస్తారా అయితే నిన్ను తీసుకెళ్ళడానికి " అనడిగా..
" నాన్న లేడు" అన్నాడు అదే భావంతో ... 😟😟

నా మనసనే కడలి కల్లోలమై కన్నీరు కెరటాల్లా రాబోతుండగా .." మరి ఎవరు తీస్కేల్తారు "అని అడిగా .....

బేలగా చూస్తూ " మమ్మీ గానీ డాడీ గానీ వస్తారు" అన్నాడు వాడు టక్కున.

😩😩😩

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది