సర్పయాగం

ఆదిపర్వము – 9
🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🙏
సర్పయాగం
అప్పుడు జనమేజయరాజు కోపంతో సర్పయాగం చేయాలని అనుకుని యాగశాలను నిర్మింపచేసి, మునులను,పండితులను ఆహ్వానిస్తాడు. అక్కడికి వేదవ్యాసుడు, వైశంపాయనులు కూడా వస్తారు. సర్పయాగం చేయడం మొదలు పెట్టారు.వారు చదువుతున్న మంత్రాలకు సర్పాలన్ని ఒక్కొక్కటిగా హోంగుండంలో పడసాగాయి. దాంతొ తక్షకుడు బయపడి ఇంద్రుని దగ్గరికి వెళతాడు.
ఇంద్రుడు తక్షకునితో "బయపడకు తక్షకా, బ్రహ్మ దేవుడు కొన్ని సర్పాలకి సర్పయాగం నుండి విముక్తినిచ్చడు నువ్వు నాతో ఉండమని" అంటాడు. సర్పాలన్ని హోమంలొ పడుతున్నాయి కాని తక్షకుడు మాత్రం రావడం లేదు. తక్షకుడు ఇంద్రుని దగ్గర ఉన్నాడని తెలుసుకుని, తక్షకునితోపాటు ఇంద్రుడు కూడా హోమగుండంలో పడాలని మంత్రాలు చదువుతారు పండితులు. దానికి ఇంద్రుడు బయపడి తక్షకా నీకు సహాయం చేయలేను అని వెళ్ళగొడతాడు. తక్షకుడు హోమగుండంలో పడబోతూ ఉండగా..
వాసుకి తన చెల్లెలు జరత్కారువుని పిలిచి "బ్రహ్మదేవుడు చెప్పినట్టుగ సర్పయాగాన్ని నీ కొడుకు ఆస్తికుడు మత్రమే ఆపగలడు, కావున అతన్ని జనమేజయరాజు దాగ్గరికి పంపించి సర్పజాతిని కాపాడమని" అడుగుతాడు. అప్పుడు జరత్కారువు ఆస్తికున్ని పిలిచి "నీ మేనమామ వాసుకి చెప్పింది విన్నావు కదా, వెళ్ళి సర్పయాగాన్ని ఆపమని" చెప్తుంది.
ఆస్తికుడు హస్తినాపురం వెళ్ళి "జనమేజయరాజా! నువ్వు గొప్పవాడివి, మంచి గుణములు కలవాడివి. ఇక్కడ యజ్ఞం చేస్తున్న మునులు పురాణాలను, శాస్త్రాలను చదివి ఉన్నారు. వేదవ్యాసుడు కూడా ఈ యాగంలో ఉన్నాడంటె ఈ యాగం ఎంత గొప్పదో అర్థమవుతుంది. నీకు శుభం జరుగుగాక అని ఆశీర్వదిస్తాడు.
జనమేజయరాజు సంతోషపడి "మహత్మా మీకు ఏంకావాలో కొరుకోండి, నా వల్ల ఐతే తప్పకుండా ఇస్తాను" అంటాడు. అప్పుడు ఆస్తికుడు "రాజా! ఈ సర్పయాగాని ఆపుము, నా మేనమామ వంశాన్ని కాపాడుము"అంటాడు. జనమేజయుడు సనేహంలో పడతాడు, అక్కడున్న మునులు "ఆస్తికుడు గొప్పవాడు, అతని కోరినట్లుగ నువ్వు యాగాన్ని అపుము" అని చెప్పడంతో యాగాన్ని ఆపుతాడు.
అప్పుడు జనమేజయరాజు యాగంలో పాల్గొన్న మునులను, పండితులను, వేదవ్యాసున్ని, అతని శిష్యులను సత్కరిస్తాడు. తరువాత వేదవ్యాసున్ని "మహత్మా! మీరు, మాతాతలు కురు రాజ్యాన్ని కౌరవ పాండవులకు పంచారు కదా; మరి వారు రాజ్యభోగాలను అనుభవించక ఎందుకు శతృత్వం పెంచుకున్నారు? మా పూర్వీకుల గురించి తెలియజేయండి" అని అడుగుతాడు.
అప్పుడు వ్యాసుడు తన శిష్యుడైన వైశంపాయనున్ని పిలిచి జనమేజయరాజు కి మహభారతాన్ని వినిపించమని చెప్తాడు. అప్పుడు వ్యాసుడు తన శిష్యుడైన వైశంపాయనున్ని పిలిచి జనమేజయరాజు కి మహభారతాన్ని వినిపించమని చెప్తాడు. జనమేజయుడు వైశంపాయనున్ని పూజించి, తన సపరివారంతో భారతం వినడానికి కుర్చుంటాడు.
వైశంపాయనుడు "రాజా! ఈ మహాభారతాన్ని వేదవ్యాసుడు రచించాడు, కావున మొదట వ్యాసుని గురించి తెలుసుకుందాం" అని మహాభారతం చెప్పడం మొదలు పెట్టాడు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది