వంట నూనెల గురించి

♥ మన ఆరోగ్యం ---- మనచేతుల్లో ♥

వంట నూనెల గురించి -----

      మీరు వంటకు ఉపయోగించే నూనె మీ వాతాన్ని పెరగనీయకుండా ఉంచగలదు. జీవితాంతం వాతాన్ని క్రమంలో ఉంచిలంటే మీరు శుద్ధమైన తైలాన్ని ( నూనె) వాడుకోవటమే మంచిది.

      రోగాలకు రాజు , వాతరోగాలు.మోకాళ్ళ నొప్పి , నడుంనొప్పి , మెడనొప్పులు , హార్ట్ ఎటాక్, పక్షవాతము , బ్రైన్ ట్యూమర్ వంటివి వాతము పూర్తిగా తగ్గి పోవటంవల్లకానీ కలుగుతాయి.

     శుద్ధమైన తైలం ( నూనె ) మీ వాతాన్ని పెరగనీయకుండా ఉంచుతుంది. ఈ శుద్ధమైన నూనె కు వాసన ఎక్కువగా ఉంటుంది , బాగా జిగురు , జిగురుగా ఉంటుంది. చిక్కగా వాసన వస్తూ ఉంటుంది.  నూనెలో ముఖ్యమైన పదార్థాలు జిగురు , ప్రోటీన్స్.

     శుద్ధమైన నూనె అంటే నాన్ రిఫైండ్ నూన్ ( Non Refined Oil ), ఏమీ కలపకుండా గానుగ నుండి సరాసరి తెచ్చుకున్న నూనె.

      భారత దేశంలో 50 సంవత్సరాల పూర్వం వరకు ఈ రిఫైండ్ ఆయిల్ లేదు. రిఫైండ్ నూనె చేసేటప్పుడు 6 కెమికల్స్ , డబుల్ రిఫైండ్ చేసేటప్పుడు 13 రకాల కెమికల్స్ వాడుతారు. ఈ కెమికల్స్ ముందు ముందు అవే విషాన్ని పుట్టిస్తాయి. ఈ రిఫైండ్ ఆయిల్ లో వాసన , జిగురు , ప్రోటీన్స్ , ఫ్యాటీ యాసిడ్స్ ఏవీ వుండవు. అపుడు అది నూనే కాదు , నీళ్ళే ఒకరకంగా.

      మన శరీరానికి నూనె వల్ల ఏమి వస్తుంది అంటే హైడెన్సిటీ లిపో ప్రోటీన్, ఇది నూనెల నుండే శరీరానికి లభిస్తుంది. నిజానికి ఇది తయారయ్యేది లివరలోనే, అదీ నూనె తిన్నపుడే. అందుకనే మీరు శుద్ధమైన నునె తీసుకుంటేనే లివరు సహాయంతో హెచ్.డి.యల్ ( H.D.L.) ఎక్కువ మోతాదులో తయారవుతుంది. నేటి రీసెర్చ్ ప్రకారం వాతాన్ని కంట్రోల్ చేసేది ఈ H.D.L., మాత్రమే. కనుక మీరు శుద్ధమైన నూనె ను వాడితే మీరు జీవితాంతం ఆరోగ్యంగా జీవించగలరు.
    జీవితాంతం వాతాన్ని క్రమంలో ఉంచాలంటే మీరు శుద్ధమైన నూనెలను వాడుకోవటమే మంచిది.
రిఫైండ్ నూనెలను తీసుకోకండి.
  " ఆరోగ్యమే ---- మహాభాగ్యం "

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది