మీదే కులం?
ఓ మితృడు ప్రశ్న.
పుట్టినప్పుడా?
పోయినప్పుడా?
భౌతికంగానా?
మానసికంగానా?
మరో మితృని ఎదురి ప్రశ్న.
నా జవాబు:
"భౌతి"కులం
"చార్వా"కులం
"ప్రేమి"కులం
"శ్రామి"కులం
"కార్మి"కులం
"కలం"కులం
"మానవ"కులం
పుట్టగానే
"పసి"కులం
పెరుగుతూ
"పిల్ల"కులం
పెరిగాక
"బాల"కులం
కౌమారంలో
"యువ"కులం
మధ్యవయస్సులో
"నడివయ"స్కులం
వృద్దాప్యంలో
"వృద్ద"కులం
చనిపోయాక
"శవ"కులం
భౌతికంగా
"భౌతి"కులం
మానసికంగా
"మనో"కులం