మన గ్రంథాల ప్రకారం సృష్టి ఎలా జరిగింది?





మన గ్రంథాల ప్రకారం సృష్టి ఎలా జరిగింది?

మన గ్రంథాల ప్రకారం సృష్టి ఎలా జరిగింది? : సృష్టి ఆవిర్భావం పార్ట్- 1:


మొదటి మానవుడు ఎవరు? ఎలా పుట్టారు ? మానవ జాతి ఎలా అభివృద్ధి చెందుతూ వచ్చింది.
మన వైదిక గ్రంథాలు దీని గురించి ఏం చెప్తున్నాయి? వివరించవలసిందిగా కోరుతున్నాను.

ఈ సృష్టి రహస్యం తెలుసుకోవడం అంటే అంత సామాన్య విషయం కాదు.ఈ విషయం చాలా అగాదమైనది.ఇది తెలుసుకోవటానికి  కొంత ఆధ్యాత్మిక జ్ఞానం, వేదమునందు ఉపయోగింప బడిన పరి భాష తెలిసివుండాలి. ప్రశ్నోపనిషత్లో ఈ సృష్టి రహస్యం తెలిస్తే(అనుభవంలోకి వస్తే) సర్వ సంశయాలు తొలిగిపోయి పరమాత్మ జ్ఞానం అర్థమవుంది అని పిప్పలాదుడు చెప్పాడు. కానీ ఈ జ్ఞానం అర్థమవటం అంత సులభం కాదు.ఋషులు కూడా దీనిని తెలుసుకోవడానికె వారి తపస్సులను ధారపోశారు. ఎందరో శాస్త్రవేత్తలు సృష్టి రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నం చేశారు,చేస్తున్నారు కాని ఎవరికి కూడా అది అర్థం అవ్వలేదు ఎందుకంటే వారు లోపలి జ్ఞానం నందు విశ్వాసం ఉంచకుండా బౌతికంగా కనిపించే వాటి పైనే పరిశోధన చేస్తున్నారు కాబట్టి.

మాములుగా ఇతర సంప్రదాయంలో దేవుడు వేరు,సృష్టి వేరుగా ఉండి ఎటువంటి పరిణామాలు లేకుండా సృష్టి జరిగినట్టు చెబుతారు కానీ సనాతన ధర్మంలో మాత్రం పరమాత్మయే సృష్టి ,ఈ సృష్టియే పరమాత్మ అన్నింటికీ తాను ఆధారం,అన్నిటిని ఆధారం చేసుకుని తాను ఉంటాడు.అన్ని గోచర , అగోచర పదార్థాలుగా తానే రూపాంతరం చెందుతాడు. ఈ విషయాన్ని మనస్సులో పెట్టుకొని(ప్రతి చోట చెప్పటం కష్టం. deep గా వెళ్లే కొద్దీ ఈ విషయం గుర్తు చేయలేము) ఈ పోస్ట్ చదవండి. ఇది వేద జ్ఞాన సంబంధ విషయం కాబట్టి ఆసక్తి కలగవచ్చు, కలుగకపోవచ్చు.

ఇది కొంచెం confusing subject దీని మీద బాగా concentration పెట్టి బుద్ది పూర్వకంగా ఆలోచిస్తే కానీ అర్థం కాని సబ్జెక్ట్. నాకు సాధ్యమైనంతలో వివరణ చేసే ప్రయత్నం చేస్తాను.మన వేదంలో శాస్త్రవేత్తలు చూడని కోణాల దగ్గరి నుండి వారు చూడ కలిగే  కోణాల వరకు అన్ని వివరించారు.

ఈ సృష్టి సృష్టింపబడక పూర్వం ఏమి ఉంది ?
ఏమి ఉందొ శాస్త్రం చెప్పలేదు కానీ ఏమీ లేవో చెప్పింది. వెలుగు లేదు,చీకటి లేదు ,గాలి లేదు,ఖాళీ స్థలం లేదు, పదార్థం లేదు.ఈ స్థితిని సామాన్య మానవుడు ఊహించటం కూడా కష్టం.ఈ విషయాన్ని గజేంద్ర మోక్ష ఘట్టంలో పోతన గారు "పెం చికటి కావల నెవ్వడు ఏకాకృతి వెలుగు" అని వర్ణించారు .
అటువంటి స్థితి ఉంది.దానికి మన ఋషులు బ్రాహ్మ పదార్థం అని పేరు పెట్టారు.దీనినే పరమాత్మ అని కూడా అంటారు.

ఆ పరమాత్మ (or బ్రహ్మపదార్థం) తత్వం ఏమి?
ఈ విషయం గురించి భగవాన్ రమణ మహర్షిని ఒకతను మీరు బ్రహ్మమును తెలుసుకున్న వారు కదా మరి బ్రహ్మం ఎలా ఉంటుంది,దాని లక్షణం ఏమి అని అడిగితే ఆయన ఒక ఉదాహరణ చెప్పాడు. "ఒకడు మామిడి పండు తిన్నప్పుడు దాని రుచి ఎలా ఉంది? అని అడిగితే అతను రుచిని ఏ విధంగా వర్ణించలేడో అదే విధంగా ఆత్మ తత్వాన్ని నిర్వచించటం కష్టం., కానీ "ఉద్దరే ఆత్మనాత్మానం" అని ఎవరిని వారే ఉద్ధరించుకొని ఆత్మ తత్వం తెలుసుకోవటానికి ప్రయత్నించి దానిని అనుభవైకవైద్యం చేసుకోవాలి అలా చేసుకున్నవాడు "బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి" అని బ్రహ్మమును తెలుసుకున్న వాడు బ్రహ్మమే అగుచున్నాడు అని చేప్పారు.అంటే ఆ ఆత్మ తత్వం నిర్వచించలేము అందుకే వేదం కూడా " న ఇతి న ఇతి" (ఇది కాదు ఇది కాదు) అని వర్ణించింది కానీ ఇది అని నిర్వచించలేదు. ఎందుకు నిర్వచించలేదు అంటే
"న తత్ర చక్షుర్ గచ్ఛతి న వాక్ గచ్ఛతి నో మన న విద్మీ న విజానామి" అక్కడికి మన మనస్సు కానీ,బుద్ది కానీ వెళ్లలేవు బుద్ది తప్ప ఆలోచించటానికి వేరే సాధనం మనకు లేదు కనుక ఆ బ్రహ్మపదార్థాన్ని నిర్వచించటం కష్టం.అందుకే వేదానికి కూడా వేదం అని పేరు పెట్టారు. వేదం అంటే నీకు ఏది తెలియదో అది తెలియదు అని తెలుసుకోవడం." నాహం మన్యే సువేదేతి నో న వేదేతి వేద చ" అని.

(పరమేశ్వరుడు అని వచ్చిన చోట బ్రహ్మపదార్థం అని replace చేసుకోండి.)

మొట్ట మొదట పరమేశ్వరునితో కలిపి ప్రకృతి ఉంది.ఎలా ఉంది అంటే ఏ విధంగానైతే పువ్వు, పువ్వు కు ఉన్న వాసన వేరుగా ఉండదో అదే విధంగా పరమేశ్వరుడు ప్రకృతి వేరుగా ఉండరు. పరమేశ్వరుని శక్తియే ప్రకృతి. వ్యక్తి ,వ్యక్తి శక్తి వేరు కానట్టే పరమేశ్వరుడు ,పరమేశ్వర శక్తి ఆయిన ప్రకృతి వేరు కాదు.
ఈ ప్రకృతి(మాయ)రెండు రకాలుగా ఉంటుంది.




ఒక దాని పేరు పరా ప్రకృతి ,రెండవ దాని పేరు అపరా ప్రకృతి అని.
పరా ప్రకృతి అంటే జ్ఞానం కల్గినది, అపరా ప్రకృతి అంటే జ్ఞానం చేత ప్రేరేపింపబడునది,బయటకు కనిపించేది అని అర్థం. అంటే అపరా ప్రకృతి(అర్థం అవటానికి శరీరంగా భావన చేయండి) పైన ఉంటుంది దాని లోపల పరా ప్రకృతి(మనస్సు గా భావన చేయండి) ఉండి దానిని(అపరా ప్రకృతిని) ప్రేరణ చేస్తుంది,ఈ పరా ప్రకృతి లోపల పరమేశ్వరుడు(మనస్సుకు ఆలోచన కల్గించే
శక్తిగా) ఉంటాడు.

పరాప్రకృతి అపరా ప్రకృతిలో ప్రేరన కలిగించడం వలన గుణములుగా (సత్వగుణం,రజోగుణం,తమోగుణం) ఆవిర్భవించింది. సత్వ తమో రజో గుణాలలో స్థాయి భేదాన్ని నిర్ణయించేది కాలం. గుర్తుంచుకోవాల్సిన విషయం  పరా,అపరా ప్రక్రుతులు  రెండు త్రిగుణములకు అతీతం. గుణములు వాటి అదీనం.

ఈ త్రిగుణములు ప్రకృతితో కలిసి కాలం(time)(సత్వగుణం వలన), కర్మ(action)(రాజో గుణం వలన),స్వభావం(nature)(తమోగుణం వలన) అని మూడు ఏర్పడ్డాయి.

(1.ఐన్ ష్టీన్ లాంటి శాస్త్రవేత్తలు వ్రాసిన time-space theory చదవండి వారు కూడా కాలం కారణం అయి ఉండొచ్చు అని దానితో విభేదించి కాలమునకు కారణం తెలియక ఆగిపోయారు
2. సృష్టి సహజసిద్ధంగా జరిగే ప్రక్రియ అని చెప్పారు కానీ తార్కికంగా ఆలోచిస్తే కార్యమునకు కారణం ఉంటుందన్న సిద్ధాంతంతో ఇది సరిపోదు )
1)కాలం అంటే " కాలం గుణ వ్యతికరాత్" అని కాలం యొక్క పని కదలికలు గుణములలో కలుగచేయటం
2)కర్మ అనగా ఏ గుణం అధికంగా కాలం నిర్ణయిస్తుందో దాన్ని బట్టి సృష్టి చేయటం
3)స్వభావం మార్పు చెందిచడానికి కారణం అయ్యేది
(ఇక్కడ వివరించిన విషయాల గురించి post లో వివరణ చేయడం కష్టం ఎవరికి వారు ఆలోచన చేయండి ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి)

ఎప్పుడైనా సృష్టి జరగాలి అన్నప్పుడు రజో గుణం పైకి వచ్చి  సత్వగుణంతో కానీ,తమో గుణంతో కానీ కలిసి మార్పు చెందుతుంది. రజో గుణం వేరొక గుణంతో(సత్వ తమో) కలిస్తేనే సృష్టి జరుగుతుంది.
రజో గుణం సత్వ గుణంతో కలిసి సత్వగుణం పైకి ఉన్నపుడు మహత్తత్వం ఏర్పడింది.

ఈ మహతత్వం మళ్ళీ రజోగుణం,సత్వగుణం తో కలిసి అహంకారం ఏర్పడింది.

మరల ఈ అహంకారం రజో గుణంతో కలిసి 3 రకాలుగా మార్పులు చెందింది.
1. సాత్విక - జ్ఞానం - awareness

2. రాజసిక - ద్రవ్యం - matter

3. తామసిక - క్రియ - actions

( కొంతమంది ఇక్కడి వరకు వచ్చి ఆగి పోయారు ఈ సృష్టి కి కారణం matter అని చెప్పారు కానీ ఈ మూడింటిని కలిపితేనే సృష్టి జరుగుతుంది)
(ఈ విషయములపై మీరు పరిశోధన చేయండి)

1. సాత్విక అహంకారం రాజసిక గుణంతో కలిసి జ్ఞానేంద్రియాలను , కర్మేంద్రియములను , మనస్సు గా మార్పు చెందాయి. ఇవన్ని సూక్ష్మ రూపంలో ఉన్నాయి(ఇప్పుడు ఉన్న రూపములని ఊహించుకోకండి , ఇప్పడు ఉన్నవి స్థూల రూపములు కానీ సృష్టి ఆరంభంలో అలా లేవు). వాటి వాటి విధులు వేరు వేరుగా ఉన్నాయి.

2. తామసిక అహంకారం రాజసిక అహంకారంతో కలిసి పంచభూతములు పుట్టాయి. ఈ పంచ భూతములు కూడా సూక్ష్మ రూపంలో ఉన్నాయి(ఇప్పడు ఉన్న రూపములని ఊహించుకోకండి).

(ప్రతి విషయంలో గుర్తు పెట్టుకోవాల్సిన విషయం పిల్లలకు తల్లి తండ్రులు పోలిక వచ్చినట్లు సృష్టిలో వచ్చే ప్రతి దాని లోపల అది దేని నుండి పుట్టినదో వాటిని,వాటి గుణములను కలిగి ఉంటుంది మరియు అన్నింటికీ లోపల పరమేశ్వరుడు ఉండి ఆ మార్పులు చేయిస్తాడు. ఉదాహరణకు తామసిక అహంకారం తీసుకుంటే ఇందులో అహంకారం,దాని లోపల సత్వతమోగున స్థితి,దాని లోపల కాలం కర్మ స్వభావం,వీటి ప్రతి ఒక్క దాని లోపల సత్వ తమో రజో గుణములు వీటి లోపల పరా,అపరా ప్రకృతులు,వీటి లోపల పరమాత్మ ఉంటాడు)

తమో గుణప్రధాన భూతములు(పంచభూతములు) సూక్ష్మ రూపంలో ఉన్నపుడు వాటిని తన్మాత్రలు అని అంటారు.
క్రింద ఇచ్చిన పట్టిక లో పంచభూతములు స్థూల స్వరూపములు కావు అనగా ఇప్పుడు మనం చూస్తున్న స్వరూపంగా లేవు.

భూతం - తన్మాత్రలు

పృథ్వి   - వాసన (భూమి)
ఆపస్   - రసం,రుచి(జలం)
తేజో.    - రూపం (అగ్ని)
వాయు  - స్పర్శ (వాయువు)
ఆకాశం  -  శబ్దం

"ఆకాశాత్ వాయు వాయొరాగ్ని ఆగ్నేరాపః ఆపహ పృథివ్యా పృథివ్యా ఓషదతః ఓశదీబ్యో అన్నం అన్నాథ్ పురుషా" అని దీని వాఖ్యానం కింద చూడండి.

సూక్ష్మ రూపంగా ఉన్న శబ్దం మార్పు చెంది ఆకాశంగా వచ్చింది.

శబ్దం ఆకాశంతో కలిసి స్పర్శగా వచ్చాయి.

శబ్దం,స్పర్శ,ఆకాశం మూడు కలిసి శబ్దం,స్పర్శ రెండు కల్గిన వాయువు వచ్చింది

శబ్దం,స్పర్శ,ఆకాశం,వాయువు నాలుగు కలిసి రూపం వచ్చింది.ఇదే అగ్ని అందుకే ఇందులో శబ్దం,స్పర్శ,రూపం ఉన్నది

శబ్దం-ఆకాశం,స్పర్శ-వాయువు,రూపం - అగ్ని
కలిసి రసం వచ్చింది
ఈ రసంతో పైవన్ని కలిసి నీటిగా వచ్చింది
అందుకే నీటికి రూపం,రసం,స్పర్శ,శబ్దం అను నాలుగు గుణములు ఉంటాయి.

శబ్దం-ఆకాశం,స్పర్శ-వాయువు,రూపం అగ్ని , రసం-జలం కలిసి వాసనగా వచ్చింది

పైవన్ని ,వాసనతో కలిసి పృథ్వి ఏర్పడింది.
అందుకే పృథ్వికి శబ్ద,స్పర్శ,రూప,రస,గందములు ఐదు ఉంటాయి.

మొత్తంగా భూమికి 5, నీటికి 4,అగ్నికి 3,వాయువుకి 2,ఆకాశమునకు ఒక గుణములు ఉన్నాయి అని తెలుస్తుంది
ఎలా ఉన్నాయి అనేది ఆలోచన చేయండి అర్థం అవ్వకపోతే అడగండి వివరించే ప్రయత్నం చేస్తాను.

(పైన జరిగిన మార్పులన్నింటికి లోపల పరమేశ్వరుడు ఉండి బయట జరిగే మార్పులకు కారణం భూతుడు అవుతాడు కానీ బయటకు చూడడానికి వాటంతట అవే మార్పు చెందుతున్నాయి అనుకుంటారు)

- సశేషం

-ఇంకా ఉంది పంచభూతాలు ఇంకా స్థూల రూపాన్ని పొందనేలేదు.....

(మన శాస్త్రములు ప్రశ్న వేయడానికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చాయి ఏ విషయములైన అర్థం కాకపోతే అడగవచ్చు ఇది కొంత లోతైన విజ్ఞానం అనుమానాలు రావడం సహజం. చర్చించండి విషయ జ్ఞానం పొందండి సనాతన ధర్మమ్ గురించి తెలుసుకోండి ప్రతి హిందువుకు ఈ జ్ఞానం అందేలా కృషి చేయండి ధర్మ పరిరక్షణలో బాగం కండి)

                                     
శివోహం శివోహం శివోహం





కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది