చరిత్రలో ఈరోజు: జూన్ 22

🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳

🌍 _*చరిత్రలో ఈరోజు: జూన్ 22*_

🎲 _*సంఘటనలు*_

🚩1897: 'రాండ్' మరియు 'ఆయెర్ స్ట్' అనే ఇద్దరు బ్రిటిష్ వలస పాలన అధికార్లను మహారాష్ట్రలోని పూనాలో 'ఛాపేకర్ సోదరులు (దామొదర్ హరి, వాసుదేవ హరి, బాలకృష్ణ హరి) ' మరియు ' మహాదెవ్ వినాయక్ రనడే ' లు చంపేసారు. 'ఛాపేకర్ సోదరులు' మరియు 'రనడే' దొరికిన తరువాత, బ్రిటిష్ వారు వారిని ఉరి తీసారు. 'ఖండొ విష్ణు సాథె' అనే పాఠశాల విద్యార్థిని, కుట్రకు సహకరింఛాడని 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షను విధించారు. భారత దేశ స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణాలు అర్పించిన మొట్ట మొదటి అమరవీరులుగా వారిని పేర్కొంటారు. మరాఠీ సినిమా '1897 జూన్ 22' 922 June 1897 http://en.wikipedia.org/wiki/22_June_18970 అనే సినీమాకి ఈ సంఘటనే ఆధారం.

🚩1940: సుభాష్ చంద్రబోస్, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించాడు.

🚩1952: విశాలాంధ్ర, తెలుగు దినపత్రిక ప్రారంభమైనది.

🎲 _*జననాలు*_

🚩1898: చిత్తూరు సుబ్రహ్మణ్యం పిళ్లై, సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్యాంసులు మరియు వాగ్గేయకారులు. (మ.1975)

🚩1932: అమ్రీష్ పురి, ప్రముఖ భారత సినిమా నటుడు. (మ.2005)

🚩1939: అడాయీ యోనత్, ఇజ్రాయిల్‌కు చెందిన మహిళా శాస్త్రవేత్త, రసాయనిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత.

🚩1945: గణేష్ పాత్రో, ప్రముఖ నాటక మరియు సినీ రచయిత. (మ.2015)

🚩1954: దేవినేని నెహ్రూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ రాష్ట్ర మంత్రి. (మ.2017)

🎲 _*మరణాలు*_

🚩1951: చిలుకూరి నారాయణరావు, భాషావేత్త, చరిత్రకారుడు మరియు సంస్కృతాంధ్ర పండితుడు. (జ.1889)

🚩1975: అన్నే అంజయ్య, ప్రముఖ దేశ సేవకుడు మరియు స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1905)

🚩1969: జూడీ గార్లాండ్, అమెరికాకు చెందిన సుప్రసిద్ధ నటి, గాయకురాలు మరియు అభినేత్రి. (జ.1922)

🚩1994: ఎల్.వి.ప్రసాద్, తెలుగు సినీనిర్మాత, దర్శకుడు, నటుడు మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (జ.1908)

🚩2003: కోదాటి లక్ష్మీ నరసింహారావు.

🚩2008: జార్జ్ కార్లిన్, అమెరికన్ స్టాండ్-అప్ హాస్యకారుడు, సామాజిక విమర్శకుడు, నటుడు, మరియు రచయిత. (జ.1937)

🚩2016: జె. వి. రమణమూర్తి, ప్రముఖ రంగస్థల మరియు సినిమా నటుడు, దర్శకుడు. (జ.1933)
💦🐳🐬🐳🐬🐳🐬🐳💦

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది