ఎండాకాలంలో


ఎండాకాలంలో అనేకరకాలైన పండ్లు దొరుకుతుంటాయి కదా! మామిడి పండ్లు, నేరేడు పండ్లు, పనస పండ్లు మొదలైనవి. నా మనవి ఒక్కటే దయచేసి మీరు ఈ పండ్లను తిన్న తరువాత వాటి విత్తనాలను బయట పడేయకండి. వాటిని శుభ్రంగా కడిగి ఓ బ్యాగులో వుంచండి. వీలైతే మీ కారులో కానీ, మీ వాహనాలు ఏవైనా కానివ్వండి అందులో ఉంచండి
మీరు కాస్త దూరం ప్రయాణం చేసేటప్పుడు మీరు వెళ్ళే దారిలో రోడ్డుకు పక్కగా ఈ విత్తనాలను చల్లండి, ఎండాకాలం తరువాత వర్షాకాలం వస్తుంది కదా! మీరు చల్లిన విత్తనాల్లో కొన్నైనా మొలకెత్తుతాయి. ఒక్క మొక్క మొలిచినా అది పెరిగి పెద్దదై చెట్టుగా మారి ఫలాలనిస్తుంది. మీ భావితరానికి మీ వల్ల ఒక్క చెట్టైనా ఇచ్చిన వారు అవుతారు.
ఇది ఒక ఆలోచన మాత్రమే కాదు... మహారాష్ట్రాలోని సతారా, రత్నగిరి ప్రాంతాలలో దీన్ని అమలు చేస్తూ మంచి ఫలితాలను పొందుతున్నారు. ప్రజలలో అవగాహనను పెంచుతున్నారు పది సంవత్సరాలనుండి.
చాలా అద్భుతమైన ఆలోచనకదా! మనం కూడా దీన్ని అమలు చేద్దామా మిత్రమా!
మీరు ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. వీలైతే మీరూ పాటించండి భావితరానికి మనమూ ఓ చెట్టును అందించినవారమవుదాం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది