చదరంగం

చదరంగం చాలా ప్రాచీనమైన క్రీడ. మనదేశంలో చదరంగం ఎన్నో క్రియాత్మక విషయాలలో ప్రాచీన కాలం నుండి చాలా ముఖ్యమైన భూమికను పోషిస్తూ వస్తుంది. చదరంగంలో నెగ్గటమనేది ప్రాచీన భారతదేశంలో చాలా విశిష్టమైన స్థానం. రాజులకు ఈ చదరంగం యుద్ధ భూమిని మరపించేది. సామన్యులకు సంసారాన్ని, రాజకీయ నాయకులకు రాజకీయ పోకడలను మరిపిస్తుంది, నేర్పిస్తుంది. ప్రాచీన కాలంలో యుద్ధంలో వ్యుహలను చదరంగ క్రీడ నుండి తీసుకున్న సందర్భాలు లేకపోలేదు. ఆనాటికీ, ఈనాటికీ చదరంగానికి ఉన్న ప్రాముఖ్యత క్షిణించలేదు. పైగా దీని సఘర్షణ లేకపోతె వ్యక్తీ మానసిక, శారీరక వృద్ధి తగ్గిపోతుంది. తనకంటూ సొంత ఆలోచన, ఒక జీవిత విధానాన్ని రూపొందించుకుని సఫలీకృతుడవ్వతమలో విఫలుడైపోతాడు. నిరంతరం మానవ మెదడు సమస్యా విశ్లేషణలతో పరిభ్రమిస్తూ ఉన్నప్పుడే వ్యక్తిత్వంలో షార్ప్(Sharp) వస్తుంది. ప్రతి సమస్యకొ పరిష్కారం ఉంటుంది. అసలు పరిష్కారం లేనిదే అది సమస్య కాలేదు. విషయమేమిటంటే, అసలు సమస్యను సృష్టించేది కూడా మెదడే. ఈ ఆలోచనా పరిణతి మానవుడిని ఆటవిక యుగం నుండి ఆటమిక్ యుగానికి తోసింది. నిజంగా ఏ జాతి చరిత్రకైనా ఇది ఓ గొప్ప అద్భుతం. దీనికంతటికీ కారణం ఆలోచనే. హేతుబద్ధమైన ఆలోచన. ఈ ఆలోచనే సైంటిఫిక్ ధాట్ గా ఎన్నో అద్భుతమైన విజయాలను సాధించింది - సాధిస్తూ ఉంది. అయితే అపజయాలు కూడా లేకపోలేదు. దీనిని మనం చదరంగానికి అన్వయిస్తే, చదరంగం ఎత్తులు పైఎత్తులతో కూడిన ఆట. ఆటలో పాల్గొనే ఇరువురి లక్ష్యం విజయం సాధించటం. ఆ క్రమంలో వారు అనుసరించు మార్గాలు చాలా ఆలోచనాత్మకంగా ఉంటాయి. ఇలా మెదడు నిరంతర సాధన చేస్తూపొతే అన్ని విషయాలలో విజయం వరించటానికి అవకాశం ఉంటుంది. ప్రత్యర్ధి దాడిని తిప్పికొట్టడంలో ఆటగాడికి ఉపకరించు ఒకే ఒక్క అంశం 'సమస్యా విశ్లేషణ'. నిజానికి ఈ శతాబ్దం 'Intellectual Century' గా చెప్పుకోవచ్చు. మార్కెటింగ్ గానీ, కంప్యూటర్ గానీ, ఎన్నో ఆధునిక వృత్తులు, ప్రవృత్తులు ఈ 'విశ్లేషణ'పై ఆధారపడి జరిగితే, అందుకే వ్యక్తీకి ఆలోచనలతో పరిణతి, తద్వారా నిర్ణయాలు తీసుకోవటం చాలా అవసరం. దీనికి తోడు పోటి తత్వం, దృఢమైన సంకల్పం కూడా ఉంటే ఇంకా మంచిది.

               చెస్ - చదరంగం సమస్యా విశ్లేషణా సామర్ధ్యాన్ని పెంచుకోవడానికి ఒక విశిష్టమైన పరికరం లేదా సాధనం.
ఏది ఏమైనా, ప్రాధమిక విషయాలపై మంచిపట్లు సంపాదించినా సాధన లేకపోతె మాత్రం ఉపయోగం ఉండదు. చదరంగానికి కావలసింది Theory - Thinking - Practice=CHESS

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది