స్టేషన్లో ట్రేన్ మూవ్ అవుతుండగా ఒక ట్రంకు పెట్టె పట్టుకొని ఒక భర్త,భార్య ఎక్కారు.ఆ మహిళ అక్కడే ఉన్న డోర్ దగ్గర కూర్చుంది,తన భర్త టెన్షన్ తో అక్కడేఅ నిలబడ్డాదు ఎందుకంటే అది రిజర్వేషన్ బోగి అని తనకు తెలుసు. ఇంతలో టికెట్ కలెక్టర్ రావడంతో తన దగ్గర ఉన్న టికెట్స్ తీసి చూపించాడు.వెంటనే టికెట్ కలెక్టర్ ఇవి జెనరల్ బోగీవి, తర్వాత స్టేషన్ రాగానే దిగి వెళ్ళి ఆ బోగిలో ఎక్కండి అని చెప్పాడు.దాంతో అతను సర్ నా భార్యా, ఈ ట్రంకు పెట్టెతో అదెక్కడానికి చాలా కష్టపడ్డాం సార్, అయినా సాధ్యం కాకనే దీంట్లోకొచ్చాం సార్.తర్వాతి స్టేషన్లో దిగండి లేదంటే అయిదువందలు ఫైన్ కట్టండి అన్నాడు టి.సి.
ఆ భార్యా,భర్తలు తమ కూతురికి బిడ్డ పుట్టడంతో చూడ్డానికి వెల్తున్నారు. అతను ఒక చిన్నపాటి వ్యాపారవేత్త దగ్గర పని చేస్తాడు. పట్టుబట్టడంతో తన యజమాని రెండు రోజుల సెలవుతో పాటు ఏడు వందలు అడ్వాన్స్ జీతం ఇచ్చాడు.అతను తన దగ్గరున్న డబ్బుల్లోంచి వంద రూపాయలు టి.సి కి ఇస్తూ " సార్ మీము ఆ జనరల్ బోగీలో ఎక్కలేము ఇదిగో ఇక్కడే డోర్ దగ్గర నిల్చుంటాము, ప్లేజ్ మమ్మల్ని మీరు నిల్చోనిస్తే మాకు పెద్ద ఫేవర్ చేసిన వారు అవుతారు" అన్నాడు దాంతో టి.సి.వంద రూపాయలు దేనికి పనికి రావు, ఎనమిది వందలు ఇవ్వండి ఇద్దరికీ సీట్స్ ఇస్తాను లేదంటే వచ్చే స్టేషన్లో దిగండి అన్నాడు. దాంతో అతని భార్య " సార్ ఎనమిది వందలు మా బిడ్డ ప్రసవానికే మేము ఖర్చుపెట్టలేకపోయాము.మేము చాలా బీదవాల్లం సార్, మమ్మల్ని వెళ్ళనివ్వండి అంది.దాంతో టి.సి మళ్ళీ "సరే అయితే నాలుగు వందలివ్వండి ఒకరికి రిసిప్ట్ ఇస్తాను ఇద్దరు కూర్చోవచ్చు "అన్నాడు. ఈసారి అతను ఇంకో వందరూపాయలు తీసి సార్ "ఈ రెండు వందలూ తీసుకోండి మాకు సీట్ వద్దు,రిసిప్ట్ వద్దు మేము ఇక్కడే నిల్చుంటాం "అన్నడు.
దాంతో ఈ సారి టి.సి కోపంగా నో నో నేను కంపల్సరీగా రిసిప్ట్ రాయాలి. బుల్లెట్ ట్రేయిన్ ప్రాజెక్ట్ మొదలవబోతుంది,అది లక్ష కోట్ల రూపాయల ప్రాజెక్ట్, ఎక్కనుండి తేవాలి డబ్బులు, ఇలా రిసిప్ట్ రాసి కలెక్ట్ చేయాలి, అది పైనుండి పెద్దల ఆర్డర్ కూడా నాలుగు వందలివ్వండి,లేదంటే దిగిపోండి "అన్నాడు.దాంతో అతను ఏమి చేయలేక నాలుగు వందల రూపాయలిచ్చాడు.
ఆ సమయంలోనే అక్కడే ఉన్న ఇద్దరు పాసింజర్స్ బుల్లెట్ ట్రేయిన్ గురించి మాట్లాడుకుంటున్నారు. వారి పక్కకున్న మిగతా పాసింజర్స్ ఇదంతా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.కాని ఆభార్యా భర్తలు మాత్రం ఏడుపుకు దగ్గరగా ఉన్నారు.ఎంతలా అంటే వాల్లని చూస్తే ఏదో సంతాప ఫంక్షన్ కి వెల్తున్నట్టు ఉన్నారు.వాల్లకు ఆ నాలుగు వందల రూపాయలతో ఎలా మానేజ్ చేయాలో అర్దం కావట్లేదు.అల్లుడిని అప్పు అడిక్కుంటే అది మంచి పద్దతి కాదు అని ఇద్దరు అనుకుంటున్నారు.
ఇంతలో అతను నాదగ్గర వందో నూటయాభై రూపాయలు ఉన్నాయి, మనం స్టేషన్ నుండి మన బిడ్డ ఇంటికి నడుచుకుంటూ వెల్దాం, మద్యలో ఏం తినొద్దు అలగైతే మనకు రెండొందలు మిగులుతాయి.ఇంటికి వెళ్ళేటప్పుడు పాసింజర్ రైలులో వెల్దాం కాకపోతే ఒక రోజు లేట్ అవుతుంది,నా యజమాని తిడుతాడు నా మనవడికోసం అవన్ని భరిస్తాను అయినా మనకు ఇంకో వంద రూపాయలు తక్కువ పడుతున్నాయ్ అన్నాడు. దాంతో అతని భార్య మన మనవడికి నువ్వొక వందరూపాయలు నీనొక వంద రూపాయలు గిఫ్ట్ గా ఇద్దామనుకున్నాం కదా, మనం ఏమన్నా వేరు వేరా ఇద్దరం ఒకటే కదా ఇద్దరం కలిసి ఒక వందరూపాయలిద్దాం అప్పుడు మనకు కావలసిన డబ్బు ఉంటుంది అంది.దాంతో ఆమే భర్త కల్లల్లో నీల్లతో గిఫ్ట్ తగ్గిస్తే ఎలా అన్నాడు, దాంతో అమే నువ్వు ఎందుకలా బాధ పడుతున్నావ్ మన కూతురు మన ఇంటికి వచ్చినపుడు ఇంకో రెండు వందల రూపాయలు ఎక్కువిద్దాం అంటూ ఏడ్చింది.
తన కల్లనుండి వస్తున్న నీటిని తుడుచుకుంటూ " నేను మోడిజీని కలిస్తే బుల్లెట్ ట్రేయిన్ లాంటివి స్టార్ట్ చేసే బదులు ఇలాంటి ట్రేయిన్స్ కి ఇంకో రెండు మూడు జనరల్ బోగీలు పెట్టండి మాలాంటి పేదోల్లకు ఉపయోగ పడతాయ్" అని అదుగుతాను అంది.దాంతో అతను తన భార్యతో "నువ్వు అమాయకురాలివే మనం పేదోల్లమే మనకు ఓటేసే హక్కు ఉందికాని నాయకులకు సూచించే హక్కు లేదు ఏద్వకే యుగాలనుండి పేదోడి బతుకు పేదోడిదేనే అన్నాడు.