🐥🐥🐥🐥🐥🐥🐥🐥🐥🐥🐥🐥
🍁డీ విటమిన్ బియ్యం🍁
ఇంతవరకు మనం డీ విటమిన్ క్యాప్సిల్స్, డీ విటమిన్ ఫుడ్ గురించి మాత్రమే విన్నాం. కానీ తాజాగా డీ విటమిన్ బియ్యం కూడా వచ్చాయి. ఇదేదో విదేశాల్లో జరిగిన అద్భుతం కాదు.. మన దేశంలో మన తెలంగాణలో ఓ రైతన్న అద్భుత ఆవిష్కరణ.
తెలంగాణ రైతు శాస్త్రవేత్త చింతల వెంకటరెడ్డి మరో అద్భుతాన్ని ఆవిష్కరించారు. సేంద్రియ పద్ధతుల్లో సాగుచేసే బియ్యం, గోధుమల్లో డీ విటమిన్ గణనీయమైన మోతాదులో ఉండేలా వినూత్న ఫార్ములాను రూపొందించారు.
🌿సాధారణంగా బియ్యం, గోధుమల్లో విటమిన్ డీ అంతగా ఉండదు. అయితే వెంకటరెడ్డి ఫార్ములా ప్రకారం రూపొందించిన ద్రావణాలను పంటపై పిచికారీ చేస్తే బియ్యం, గోధుమల్లో విటమిన్ డీ గణనీయమైన మోతాదులో వస్తుందని ఆయన చెబుతున్నారు.
తన ఫార్ములాపై అంతర్జాతీయంగా పేటెంట్ కోసం గత ఏడాది దరఖాస్తు చేయగా, తాజాగా నోటిఫికేషన్ వెలువడింది. చింతల వెంకటరెడ్డి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని అల్వాల్‌కు చెందిన ప్రముఖ ద్రాక్ష రైతు.
👉రసాయనాలు వాడకుండా, జన్యుమార్పిడి వంటి ఖరీదైన సాంకేతికతలు వాడనవసరం లేకుండానే ధాన్యం, గోధుమ పంటల్లో ఎక్కువ మోతాదులో విటమిన్ డి వచ్చేలా వెంకటరెడ్డి విజయం సాధించారు.🍁
🐥🐥🐥🐥🐥🐥🐥🐥🐥🐥🐥🐥