యువతకు ఆదర్శం..భవిష్యత్తుకు సంకేతం
జీవితం కొందరికి భారం. ఇంకొందరికి యుద్ధం. మరికొందరికి మాత్రం అదో పేషన్. ఈ ప్రయాణంలో కష్టపడే వాళ్ళు కోకొల్లలు. కానీ కొందరే విజేతలుగా నిలబడుతున్నారు . చాలా మంది మాత్రం గెలుపు వాకిట్లోనే నిలిచి పోతున్నారు. అసలు విజయానికి ఓటమికి మధ్య తేడా నిమిషమే.
ప్రతి ఒక్కరికి ఏదో ఒక గోల్ ఉండే ఉంటుంది. నేటి యువతీ యువకులకు మాత్రం అమెరికానే రోల్ మోడల్ . అదే మన దారి అనుకుని ఆగిపోదామా. వీటన్నిటికీ ఒకే ఒక్క సమాధానం మాత్రం అతడు మాత్రమే ఇవ్వగలడు.. అతడే మోటివేషనల్ స్పీకర్ గా కొన్నేళ్లుగా హైదారాబాద్ లో రాణిస్తున్న సుధీర్ సాండ్ర.
ఇలాంటి స్పార్క్ ..కెపాసిటీ ..దమ్మున్న వాళ్ళను ఇంపాక్ట్ ఏరి కోరి ఎంచుకుంటుంది. వాళ్ళను భవిష్యత్తు కోసం ఉబలాట పడే యువతకు ట్రైనింగ్ ఇప్పించేలా చేస్తోంది. అక్కడ తలపండిన మేధావుల కలయిక మనల్ని అబ్బుర పరిచేలా చేస్తుంది. అందులో మనోడు కూడా ఒకడు. నిస్తేజం నిండిన వాళ్ళు ..నిరాశతో తల్లడిల్లే వాళ్ళు ..అతడు డయాస్ మీదకు వచ్చేసరికల్లా అలర్ట్ అయిపోతారు.
అంతేనా అతడి మాటల ప్రవాహంలో లీనమై తమను తాము మరిచి పోతారు. కొత్త విషయాలు అలవోకగా నేర్చుకుంటారు. కొద్దీ పాటి సమయం ..కానీ యుద్ధంలో గెలవడానికి కావాల్సిన సరంజామా లభిస్తుంది సుధీర్ రూపంలో. ప్రతిదీ పక్కాగా ప్లాన్ చేసుకుంటూ పోతే మనకెందుకు రాదు సక్సెస్ అంటాడు.
నెల్లూరు కు చెందిన సాండ్ర . కన్నవారు గర్వించే స్థాయికి చేరుకున్నాడు. మోటివేషనల్ స్పీకర్ గా , లైఫ్ స్కిల్స్ కోచ్ గా .. క్లినికల్ సైకాలజిస్ట్ గా ..ఇలా పలు రూపాల్లో అతడు జీవితానికి కావాల్సిన ఎనర్జీ ని అందిస్తాడు . గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే వాళ్లకు ..ప్రెసెంటేషన్ ఇవ్వడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు . అలాంటి వారంతా సుధీర్ ఇచ్చే టిప్స్ , నోట్స్ వాళ్లకు ఎంతగానో ఉపయోగపడుతాయి .
లక్నోలో సైకాలజీ చేసిన సాండ్ర కు ఎలా శిక్షణ ఇవ్వాలో ..ఏ టైం లో ఏం చదవాలో ..లైఫ్ లో గమ్యాన్ని ఎలా చేరుకోవాలో ..తీర్చి దిద్దుతాడు. ఇంజనీరింగ్ చదివిన ఈ కుర్రాడు ఏ ఇంజనీరో లేదా ఏదో కంట్రీలో సెటిల్ కావాల్సిన అతను ఉన్నట్టుండి ట్రైనర్ గా పేరు పొందారు. ఇదంతా కేవలం ఒక్క రోజులో జరిగింది కాదు . ఎన్నో రోజులుగా నిద్రాహారాలు మాని కష్టపడితే వచ్చిన సక్సెస్ ఇది . వ్యక్తిత్వ వికాసం ఇప్పుడు జీవనోపాధి గా కాకుండా ఎందరో జీవితాల్లో దీపాలు వెలిగిస్తుంది.
గూగుల్ ..యూట్యూబ్ లోకి వెళ్లి ఇంపాక్ట్ అని సెర్చ్ చేయండి . వందల వీడియోలు మనల్ని ఆత్మీయంగా పలకరిస్తాయి . మెరుగైన విజయం దక్కించుకునేందుకు కావాల్సిన బలాన్ని ఇస్తాయి.
లక్షలు ఖర్చు చేసి ..జులాయిగా తిరుగుతూ ..స్మార్ట్ ఫోన్ల జోరులో జోగుతున్న వాళ్ళు యంగ్ ఆంట్రపెన్యూర్ గా ..మేనేజర్ గా ..సాఫ్ట్ ..లైఫ్ స్కిల్స్ ట్రైనర్ గా దూసుకెళుతున్న సుధీర్ సాండ్ర ను స్ఫూర్తిగా తీసుకోవాలి . టైం కుదిరితే అతడిని కలవండి .. ఇంపాక్ట్ లో భాగం పంచుకోండి. మీ బతుకులో మీరే విజేతలుగా నిలవండి.