పార్టీలకి అతీతంగా చెబుతున్నాను ఇది ఎవరు పార్టీలకి అన్వయించుకొని చూడవద్దు
₹ ఒక మనిషి సాధారణంగా బ్రతకడానికి కావాల్సినవి :-
గాలి ,నీరు, ఆహారం ,ఆరోగ్యం ,గుడ్డ ,గూడు ,
₹ అదే ఒక మనిషి ప్రభుత్వపరంగా బ్రతకాలి అంటే కావలసినవి :-
₹ పుట్టిన సర్టిఫికెట్ ,
₹ ఆధార్ కార్డు
₹ పాన్ కార్డు
₹ బ్యాంక్ ఎకౌంట్ పాస్ బుక్కు
₹ చదివిన స్కూల్ సర్టిఫికేటు
₹ చదివిన డిగ్రీ సర్టిఫికేటు
₹ రేషన్ కార్డు
₹ నివాస ధ్రువీకరణ పత్రం
₹ ఆదాయ ధ్రువీకరణ పత్రము
₹ కుల ధ్రువీకరణ పత్రము
₹ కార్మికుడైతే భీమ కార్డు
₹ ఇన్సూరెన్స్
₹ స్థలం ఉంటే రిజిస్ట్రేషన్ పత్రాలు
₹ భూమి ఉంటే భూమి పత్రాలు
₹ ఇల్లు ఉంటే ఇంటికి ప్లాన్ అప్రూవలు ఇటువంటి ఇంటి కాగితాలు
₹ కరెంట్ బిల్లు
₹ ఉద్యోగం చేస్తే గుర్తింపు కార్డు
₹ పెళ్లి చేసుకుంటే పెళ్లి సర్టిఫికేటు
₹ పిల్లలు పుడితే వాళ్లు మనకే పుట్టారని సర్టిఫికెట్
₹ ఇక ఆఖరిగా చనిపోతే మరణ ధ్రువీకరణ పత్రం ఇది మనకు కాదు గాని మన తర్వాత వాళ్లకి తప్పనిసరిగా కావాల్సిన కాగితం
ఇవి కాక బతికుంటే కార్లు వ్యాన్లు హెలికాప్టర్లో ఇలాగా వాటికి కొన్ని కాగితాలు ఆఖరికి ఇంట్లోనే ఫ్యాన్ దగ్గర నుంచి మనం ఏది వాడిన ప్రతి దానికి కాగితం ఎందుకు ఇవన్నీ మనము అని రుజువు చేసుకోవడానికి ఇవి మనవి అని సాక్ష్యం చూపించుకోవడానికి .
ఛీ ఎదవ జీవితం .
ఏ గవర్నమెంట్ కైనా కానీ ఒక్కసారి కాగితాలిస్తే సరిపోదా ? లేదా స్కూల్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళ డేటా మొత్తం ఉంటది కదా
మళ్ళీ మళ్ళీ ఏ చిన్నదైనా కానీ ఇప్పుడు పైన చెప్పిన వాటి ల్లో కనీసం ఐదు కాయితాలు తగ్గకుండా జిరాక్స్లు ఇస్తూనే ఉండాలి ఒక ప్రభుత్వానికి కాదు ఏ ప్రభుత్వమైనా అది ఏ పథకమైనా గాని అది ఏ నిరూపణ కైనా గాని
అన్నీ కంప్యూటర్ లోనే చేస్తున్నాము అన్ని ఆన్లైన్ అయిపోయినా కూడా ఇంత పేపర్ ఖర్చు అవసరమా ?
ఒక వేలిముద్ర వేస్తేనో లేదా ఒక ఐడి కార్డు చూపిస్తేనో (ఏదైనా ఒక ఐడి కార్డు) మొత్తం డేటా మీ దగ్గర ఉంటది కదా మా కళ్ళు స్కానింగ్ చేశారు చేతులు ఏళ్ళు అన్నీ స్కాన్ చేశారు ఇంకా మేము ఇవ్వాల్సిన అవసరం ఏముంటది .