ఆలోచన - స్థిరత్వం






*ఆలోచన - స్థిరత్వం*

*ఒక స్త్రీ పదికిలోమీటర్లు ఒక గంట నడిస్తే* 
*ఒక పురుషుడు అదే పదికిలోమీటర్లు నడవడానికి ఒకటిన్నర గంట తీసుకున్నాడు*

*ఇప్పుడు ఇక్కడ ఎవరు వేగంగా నడిచారు అంటే స్త్రీ అనిపిస్తుంది*

*స్త్రీ చక్కగా ఉన్న దారిలోను, పురుషుడు ఎత్తుపల్లాలు కొండలు గుట్టలు ఉన్న దారి ద్వారా వచ్చాడు. ఇప్పుడు ఎవరు వేగంగా అంటే పురుషుడని అనిపిస్తుంది*

*ఆ స్త్రీ కి 60 ఏళ్ళని, పురుషుడికి 40 ఏళ్ళని చెప్పి 
ఇప్పుడెవరు వేగంగా నడిచారు ?*
*అంటే స్త్రీ అనిపిస్తుంది*

*అదే పురుషుడు 140 kg అని, స్త్రీ 60kg అని చెబితే, పురుషుడు వేగంగా నడిచాడు అనిపిస్తుంది*

*ఇలా ఒక్కో విషయం తెలుస్తున్నప్పుడు మన అభిప్రాయలు మారిపోతూ ఉన్నాయి. స్థిరమైన అభిప్రాయలు ఉండడం లేదు*

*అందుకే ఏమీ తెలియకుండా ఎవరి గురించి పూర్తిగా తెలుసుకోకుండా అసలు అభిప్రాయం చెప్పకూడదు.*

*ఇదే జీవితం.*
*మనం ఒకరి గురించి ఆలోచించకుండా త్వరగా ఒక అభిప్రాయానికి వచ్చేస్తాం. పూర్తిగా తెలిసాక అభిప్రాయాన్ని మార్చుకుంటూ ఉంటాము*

*అందరిని మనతో పోల్చుకోవడమో, మనల్ని వాళ్ళతో పోల్చుకోవడమో చేస్తాము.*

*జీవితం ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. వారికి దొరికే అవకాశాలు వేరుగా ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కోరకమైన శక్తి ఉంటుంది. వారు ఎదుర్కోవలసిన సమస్యలు వేరువేరుగా ఉంటాయి. వాటి పరిష్కార మార్గాలు వేరుగా ఉంటాయి.*

*జీవితం ఎప్పుడూ అనుభవిస్తే కానీ పూర్తి అవగాహనో లేక అర్థమో తెలియదు. మరొకరితో పోల్చుకుని ఉన్న ఆనందాన్ని పోగొట్టుకోకండి*

*మీ జీవితానికి మీరే కథానాయకుడు మీరు మాత్రమే నాయకుడు. ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండండి. నిదానంగా ఉండండి. తృప్తిగా ఉండండి.*

*చిరునవ్వుతో పలకరిస్తూ ఉండండి.*
*ప్రశాంతంగా ఉండండి.*

👍👍🌹🌹






కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది