మధ్యతరగతి మా రాజులం ---- GOVT.కి పాడి ఆవులం 🐄🐄🐄 ఎందుకంటే.





మధ్యతరగతి మా రాజులం ---- GOVT.కి పాడి ఆవులం 🐄🐄🐄
ఎందుకంటే.

▪️ రూపాయి బియ్యం తినలేం..50 రూపాయలకి బియ్యం కొనలేం

▪️ మున్సిపల్ నీళ్ళు తాగలేం.. మినరల్ వాటర్ కొనలేం

▪️ ఇందిరమ్మ ఇళ్ళలో ఉండలేం..కలల ఇల్లు కట్టుకోలేం

▪️ పరభుత్వ బడికి పంపలేం..కార్పొరేట్ ఫీజులు కట్టలేం

▪️ సర్కారు దవాఖానా కు పోలేం.. కార్పొరేట్ బిల్లులు కట్టలేం

▪️ సటీ బస్సుల్లో వెళ్ళలేం..బండికి పెట్రోలు కొనలేం
      ఎందుకంటే..మనం మిడిల్ క్లాస్..కాబట్టి.!!!
 
👉🏻పదవారికి ఇచ్చే రూపాయి బియ్యం మీద ప్రభుత్వం భరించే సబ్సిడీ ని, పన్నుల రూపంలో ప్రభుత్వాలకి చెల్లించేది మనమే.

👉🏻పరభుత్వం పేదవారికి సొంత ఇల్లు కట్టించడం కోసం ఖర్చు పెట్టె కోట్ల రూపాయలూ మన పన్నుల డబ్బే.

👉🏻పరభుత్వ టీచర్లకి జీతాలు ఇచ్చేది మన పన్నుల డబ్బుతోనే, ప్రభుత్వ డాక్టర్లకి జీతాలు ఇచ్చేది మన పన్నుల  డబ్బుతోనే..

👉🏻పదవాళ్ళ కోసం 100 యూనిట్ల లోపు ప్రభుత్వం ఇచ్చే విద్యుత్ సబ్సిడీ భారం మోసేదీ, అంతకన్నా ఎక్కువ కరెంట్ ఉపయోగించే మనమే..

👉🏻ఇంతెందుకు, పేదవారి కోసం కేంద్రం తెరిపించిన జన్ ధన్ ఖాతాల నిర్వహణా భారం మోయలేకే, బ్యాంకులు మన మధ్యతరగతిని చార్జీల పేరుతో బాదుతున్నాం అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్ పర్సన్ అరుంధతి చెప్పారు కదా..
 
👉🏻పదవారు మాత్రం పన్నులు కట్టరా? అంటే.. ఉప్పు మీద, పప్పు మీద అన్నిటి మీదా పన్నులు ఉన్నాయి. పేదవాళ్ళు కూడా ఈ పరోక్ష పన్నులు కడతారు. అయితే, సబ్సిడీలు సేవల రూపంలో పేదవారికి ప్రభుత్వం ఆ పన్నుల డబ్బుని తిరిగి ఖర్చు పెడుతోంది. ఇక ధనికులకి ఈ పన్నులు భారమే కాదు. సమస్య అంతా మనకే..
 
👉🏻మధ్యతరగతి ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, చిన్న పరిశ్రమల వారికే ప్రభుత్వం నుంచి పన్నులకి తగిన సేవలు అందడం లేదు. పన్నుల బాదుడే తప్ప సేవలు దిగదుడుపే..
 
👉🏻సంక్షేమ పథకాల అమలు సక్రమంగా జరిగితే, ఈ దేశంలో పేదరికం ఎప్పుడో మాయం అయ్యేది. అవి సక్రమంగా చేయకుండా, ఇంకా పేదలకి సంక్షేమ పథకాల పేరుతో, మధ్యతరగతి నుంచి పన్నులు పిండుకోవడం దారుణం. పేదవారికి ఇచ్చే సంక్షేమ పథకాల భారం, పెద్దలు చేసే స్కాముల భారం రెండూ మోస్తున్నది మన మధ్యతరగతే. అటు పేదలు, ఇటు పెద్దల మధ్య నలుగుతున్న మధ్యతరగతి కి ఈ కష్టాలు ఎందుకు?
 
ఎందుకంటే....✍🏻
 
👋🏻కులం పోవాలని చెప్పేది మనమే..👋🏻కులం చూసి ఓటు వేసేది మనమే..

👋🏻అవినీతి పోవాలనేది మనమే.. 👋🏻మన కులపోడు అవినీతి చేస్తే సమర్ధించేది మనమే..

👋🏻ఇంటికో భగత్ సింగ్ పుట్టాలని చెప్పేది మనమే..👋🏻మన ఇంట్లో మాత్రం బిల్ గేట్స్ పుట్టాలని కోరుకునేది మనమే..

👋🏻మర్పు రావాలని చెప్పేది మనమే..👋🏻అబ్బే జనం  మారరండీ అంటూ నిరాశ నూరిపోసేది మనమే..
 
అందుకే.. మనం జస్ట్ ప్రభుత్వానికి పన్నులు కట్టే 🐄🐄🐄 పడి ఆవులుగా మిగిలిపోతున్నాం....
నిజం నిప్పు లాంటిది




కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది