💐భర్య భర్తల చక్కటి బంధం💐







అమ్మ గారింట్లో  అధికారం  చెలాయిస్తూ  పెరుగుతాం  
అత్త గారింట్లో అణకువుగా  ఉండమని చెప్తాడు నాన్న 

అమ్మ గారింట అల్లరిగా తిరిగేస్తూ ఉంటె ఆనందంతో ఉప్పొంగే అమ్మ అత్తగారింట్లో నిదానంగా అడుగులు  వేయాలంటుంది అమ్మ 

అమ్మ గారింట్లో మనసులో ఉన్నదీ ఉన్నట్టు చెప్పేసే 
స్వేచ్ఛ అత్తగారింట మాటల్ని పొదుపుగా వాడమంటుంది బామ్మ

అమ్మ గారింట్లో ఒక్క మాట అంటే చాలు అలిగేస్తాం  
అత్తగారింట్లో మనసును గాయపరిచేలా మాటలు అంటున్న మన్నించేయమంటుంది అమ్మమ్మ  

పెళ్లి చేసే ముందు అమ్మాయికి మాత్రమే అన్ని మాటలు చెప్పేస్తారు అబ్బాయికి కూడా నాలుగు మాటలు  ఎందుకు చెప్పరు

తన అభిప్రాయాలు అభిరుచులు అలవాట్లు ఇష్టాలు  అయిష్టాలు అన్ని పుట్టింట్లోనే వదిలేసి వస్తారు  

తన చిన్నప్పటి కలను
పెరిగిన ఇంటిని 
ప్రేమించిన అమ్మ నాన్న ని 
అల్లరి చేసి ఆటపట్టించే అక్క తమ్ముళ్లను  
కలిసి తిరిగిన  స్నేహితులను  
అందర్నీ వొదిలేసి  వస్తుంది 
మీఒక్కరిలో అందరూ కనిపిస్తారని  ఆశతో

ఇన్ని వదిలేసి వచ్చే తనకు నీ ప్రేమను అందించు చాలు అన్ని మరిచిపోయి నిన్ను నీకంటే రెట్టింపు ప్రేమిస్తుందని  చెప్పండి 

భార్య అంటే బాధిస్తుంది భర్త అంటే భరించేవాడు అని చాల చెప్పి నవ్వుకుంటారు  

భర్త అనేవాడు భార్యని బాధపెట్టకుండా చూసుకోవాలి  
అందరి ముందు అధికారం చెలాయించడం కాదు భర్త అంటే,, ఎందరిలో ఉన్న నీకోసం నేను ఉన్నానని ధైర్యం ఇచ్చేవాడు భర్త

తల్లిని పూజించే  వాడు తప్పకుండ భార్యని ప్రేమిస్తాడు   
భార్యని ప్రేమించే వాడు తప్పకుండ పరాయి స్త్రీలను  గౌరవిస్తాడు



Key Words : Telugu WhatsApp

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది