కరోనా వైరస్త - స్మాత్ జాగ్రత్త





ఒక గూడులో కోడి,  కొన్ని పిల్లలు ఉండేవి. 
కోడి తన పిల్లలకు బయటకు రాకూడదు. బయటకు వస్తే ప్రమాదం అని హెచ్చరించేది. 
పిల్లలు తల్లి తో పాటు తిరిగేవి గూటిలో భద్రముగా ఉండేవి. 
ఒక రోజు తల్లి మాట వినకుండా ఒక పిల్ల బయటకు వచ్చింది.
అమాంతంగా గద్ద ఆ పిల్లను తన కాళ్లతో పట్టుకొని ఆకాశం వైపు పైకి లేచింది. 
కోడిపిల్ల చాలా సంతోషం తో నేను బయటకు వస్తే ప్రమాదం లేదు! 
నేను అందరి కన్న హైట్ లో గాల్లో తేలిపోతున్నాను అని ఆనందపడుతుంది. ఇంతలో గద్ద చెట్టుమీదకు తీసుకెళ్లి కోడిపిల్ల మెడ పట్టినప్పుడు గుర్తు కొస్తుంది. అమ్మ బయటకు వస్తే ప్రమాదం అని ఎందుకు చెప్పిందో 
గ్రహించేలోపు ప్రాణం గాల్లో కలిసి పోతుంది.

అలాగే! కరోనా వైరస్ ఉన్నది. బయటకు వస్తే ప్రమాదం అని నాయకులు,అధికారులు హెచ్చరిస్తున్నా, అనేక మంది వారి మాటలు వినకుండా బయటకు వస్తున్నారు. 
మార్గం మధ్యలో పోలీస్ వారి నుండి తప్పించు కొన్నప్పుడు ఆహా! నా తెలివి అద్భుతం పోలీస్ వారికి దొరకలేదు. అని సంబర పడతారు. 
కానీ! ప్రమాదం పోలీస్ ల వద్ద లేదు. 
బయట కరోనా వైరస్ రూపంలో ఉన్నది. 
నీకు నీ కుటుంబాన్ని అంటుకొన్నదని గ్రహించే లోపు జరగ వలసిన నష్టం జరుగుతుంది. 

తస్మాత్ జాగ్రత్త



Key Words : Telugu WhatsApp

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది