మన జీవితము విస్తారాకులాంటిది ;;;
విస్తరాకును ఎంతో శుభ్రంగా ఉంచుకొని
నీటితో కడిగి నమస్కారం చేసుకుని 'భోజనానికి కూర్చుంటాము.భోజనము తినేవరకు ఆకుకు
మట్టి అంటకుండా జాగ్రత్త వహిస్తాము.....
తిన్న మరుక్షణం ఆకునుమడిచి దూరంగా' పడేస్తాం.
మనిషి జీవితం కూడా అంతే ,ఊపిరి పోగానే ఊరి బయటపారేసి వస్తారు.....
విస్తరాకు'పారేసేప్పుడు సంతోషపడుతుంది. ఎందుకంటే పొయేముందు ఒకరి ఆకలిని
తీర్చటానికి తను ఉపయోగపడ్డానులే
అన్న తృప్తి'ఆకుకు మిగిలి నందుకు----
విస్తరాకుకు.ఉన్న ఆలోచన మనలో కూడా
కలగాలనీ కొరుకుంటూ సాయము చేసే అవకాశము వచ్చినపుడు ఉపయోగించుకుందాము...
మళ్లీ ఎప్పుడైనా చేయవచ్చులే అనుకొని
వాయిదావేస్తే ఆ అవకాశము మళ్లీ వస్తుందని అనుకుంటే కుండఎప్పుడైనా పగిలిపోవచ్చు. అప్పుడు విస్తరాకుకు'ఉన్న తృప్తి'కూడా మనకి మిగలదు....
ఎంత సంపాదించినా ఒక్కపైసా' కూడా తీసుకుపోగలమా?కనీసం మన ఒంటిమీద బట్ట కూడా మిగలనివ్వరు..అందుకే ఊపిరి ఉన్నంత వరకు నలుగురికి ఉపయోగపడే విధంగా జీవిద్దాము..
మీరేమంటారు???????మికే వదిలేస్తున్నా